జుట్టు రాలిపోకుండా ఉండటానికి ఎన్నో సహజ పద్దతులు ఉన్నాయి. కానీ వెల్లుల్లి కూడా జుట్టు రాలకుండా చేయగలదు అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు. ఈ విషయం చాలా మందిని తెలియదు. వెల్లుల్లి ని కేవలం ఆహార పదార్ధంగా, లేదా ఆరోగ్య సంరక్షణలో ఉపయోగిస్తారు అనే విషయం మాత్రమే అందరికి తెలిసు. కానీ జుట్టు రాలకుండా చేయడంలో వెల్లుల్లి ని మించినది ఏదీ లేదని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

 Image result for garlic for hair

వెల్లుల్లి తో ఇంట్లోనే షాంపో తయారు చేసుకోవచ్చట లేదా వెల్లుల్లి రసంతో చేసిన షాంపో లో మార్కెట్ లో అందుబాటులోనే ఉంటాయని అంటున్నారు. మరి సహజపద్దతిలో వెల్లుల్లి షాంపో ఎలా తయారు చేసుకోవచ్చు ఏ విధంగా ఈ షాంపో జుట్టు రాలకుండా చేస్తుందో ఇప్పుడు చూద్దాం. తలపై ఉండే అనేక రకాల ఇన్ఫెక్షన్ల కారణంగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. చుండ్రు వంటి అనేక కారణాలు జుట్టు ఊడిపోవడానికి ప్రధాన కారణం.అయితే వెల్లుల్లి లో ఉండే ఘాటైన గుణాలు తలపై ఉండే చర్మం ఇన్ఫెక్షన్ కి గురవకుండా కాపడుతుందట.

 

ఇంట్లోనే ఈ షాంపో తయారు చేసుకోవాలంటే..

 Image result for garlic

మంచి వెల్లుల్లిపాయలు తీసుకుని వారి రేఖలు వాటిపై ఉండే పోర పోకుండా జాగ్రత్తగా ఒలుచుకోవాలు. ఇలా పెద్దగా ఉండే రేఖలని 10 నుంచీ 15 వరకూ తీసుకోవాలి. ఇప్పుడు వాటిని మెత్తగా దంచుకుని పేస్టులా చేసి వడగట్టి ఆ రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ మిశ్రమానికి పుదీనా లేదా నిమ్మగడ్డి ఆయిల్ ని కలపాలి. ఎందుకంటే వెల్లుల్లి రసం వాసన పోవడానికి ఈ నూనెలు కలుపుతారు. ఇదిలాఉంటే ఈ మిశ్రమాన్ని ఆర్గానిక్ తో తయారు చేయబడిన షాంపో లో కొద్దిగా కలిపి తల స్నానం చేయండి. మిగిలిన షాంపో ని ఒక సీసాలో ఉంచి గట్టిగా మూత పెట్టి ఉంచండి. ఇలా వారానికి రెండు సార్లు అలా రెండు నెలలు చేస్తే తప్పకుండా జుట్టు రాలడం ఆగిపోతుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: