గుడ్డు ఆరోగ్యానికి చాలా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. గుడ్డులో పోషక పదార్థాలు, ప్రొటీనులు మరియు కొలైన్లు కలిగి ఉంటాయి.  గుడ్డు సంపూర్ణ పోష‌కాహార‌మ‌నే విష‌యం మ‌న‌కు తెలిసిందే. ఇందులో మాంస‌కృతుల‌తో ఇతర పోష‌కాలు స‌మృద్ధిగా ఉంటాయి. అయితే గుడ్డు ఆరోగ్యానికే కాదు.. అందాన్ని స‌మ‌కూర్చుడంతో కూడా ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది.


ఇటీవ‌ల కాలంలో చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు మ‌హిళ‌లు ర‌క‌ర‌కాల కాస్మోటిక్స్ వాడుతూ అనేక విధంగా ఇబ్బంది ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌హిళ‌ల్లో స్కిన్ డ్యామేజ్ మ‌రింత పెరుగుతంది. ఇలాంటి వారికి చర్మ, కేశ సౌందర్యానికి గుడ్డు ఎలా ఉపయోగపడుతుందో ఓ లుక్కేయండి..


- గుడ్డులోని తెల్లసొన ముఖంపై పోతల వేయడం వల్ల వయస్సు పెరిగే కొద్దీ ముఖం పై వచ్చే ముడతలు, స‌న్న‌టి గీత‌లు రాకుండా ఉంటాయి. వారానికి రెండు సార్లు ఇలా వేసుకోవడం వల్ల య‌వ్వ‌నంగా కనిపిస్తారు.


- ఎగ్ వైట్ లో పెరుగు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం స్మూత్ గా ఫెయిర్ గా మారుతుంది. అదే విధంగా చ‌ర్మం గ్లోగా కూడా మార‌తుంది.


- ఎగ్ వైట్ లో రెండు మూడు చుక్కలు టీట్రీ ఆయిల్ వేసి మొటిమలున్న ప్రాంతంలో నెమ్మదిగా రాయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, వాటి వల్ల వచ్చే మచ్చలు తగ్గిపోతాయి.


- గుడ్డులోని పచ్చసొనలో ఆఫ్ స్పూన్‌ నిమ్మరసం, ఒక స్పూన్‌ ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత వాష్ చేసుకుంటే పొడిచర్మం తగినంత తేమను పొంది మృదువుగా మారుతుంది.


- గుడ్డు సొనలో ఒక స్పూన్‌ నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి.  కొంత స‌మ‌యం త‌ర్వాత షాంపూ తో తలస్నానం చేస్తే జుట్టు పెరగడమే కాకుండా, కోమలంగా మారుతుంది.


- ఎగ్ వైట్‌లో ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత క్లీన్ చేసుకుంటే స్కిన్ కాంతివంతంగా మారుతుంది.


- ఎగ్ వైట్‌లో ఒక టేబుల్ స్పూన్ శెనగపిండి క‌లిపి వారానికి ఒక సారి ఫేస్‌కి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మ‌పై ఉన్న డ‌స్ట్ తొలిగి అందంగా మారుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: