స‌హ‌జంగా చాలా మంది మ‌హిళ‌ల్లో ఎక్కువగా బాధ‌పెట్టే స‌మ‌స్య మొటిమ‌లు. అవి త‌గ్గేందుకు  రకరకాల ట్రీట్మెంట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఉప‌యోగించినా ప్ర‌యోజ‌నం క‌నిపించ‌దు. అలాగే కొంత మంది పురుషులు కూడా మొటిమల సమస్యతో బాధపడుతుంటారు. నిజానికి ఆయిల్ ముఖం ఉన్న వారు మొటిమలు, మచ్చలకు ఎక్కువగా వ‌స్తుంటాయి. ముఖంలో ఎక్కువ ఆయిల్స్ ఉన్నట్లైతే అది ఎక్కువ ఇన్ఫెక్షన్స్ కు మరియు మచ్చలకు దారితీస్తుంది. 


పరోక్షంగా ఒత్తిడితోనూ కొన్నిసార్లు మొటిమ‌లు వస్తుంటాయి.ఇలా మొటిమలు, మచ్చలున్న ముఖంతో నలుగురిలోకి పోవడానికి ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా స్పెషల్ కార్యక్రమాలు, ఫంక్షన్స్, పార్టీలు ఉన్నప్పడు మరింత ఎక్కువ బాధపడుతుంటారు. అయితే వీట‌న్నిటికి సులువైన చిట్కాల‌తో చెక్ పెట్ట‌వ‌చ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 


- టమోటో రసాన్ని ఫేస్‌కి అప్లై చేసి మర్ధన చేయడం లేదా టమోటో స్లైస్ తో మొటిమల మీద మర్దన చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల టమోటోల్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మొటిమ‌లు త‌గ్గేలా చేస్తుంది.


- పెరుగులో కొద్దిగా వంట‌సోడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్ర‌మాన్ని ఫేస్‌కి అప్లై చేసి కొంత స‌మ‌యం త‌ర్వాత వాష్ చేసుకుంటే మొటిమ‌లు త‌గ్గుతాయి.


- పసుపు, అల్లం ఈక్వ‌ల్‌గా తీసుకొని పేస్ట్ లా చేసుకోవాలి. రాత్రి ప‌డుకునే ముందు మొటిమ‌లున్న చోట అప్లై చేసి మార్నింగ్ క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు సులువుగా త‌గ్గిపోతాయి.


- వేపాకుల‌ను నీటిలో మ‌రిగించి అందులో కొంచెం ప‌సుపు మ‌రియు పెరుగు వేసి మిక్స్ చేయాలి. ఆ మిశ్ర‌మాన్ని ఫేస్‌కు అప్లై చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.


- ఎగ్ వైట్ ను తీసుకొని మొటిమల మీద అప్లై చేయాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం మొటిమ‌లు ఈజీగా త‌గ్గిపోతాయి.


- నిమ్మర‌సాన్ని మొటిమ‌లు ఉన్న చోట కాట‌న్ బాల్‌తో అప్లై చేయాలి.  రాత్రి ప‌డుకునే ముందు అప్లై చేసి మార్నింగ్ వాష్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.


- ప‌సుపులో కొంచెం నిమ్మ‌రసం క‌లిపి మొటిమ‌లు ఉన్న చోట అప్లై చేయాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత క్లీన్ చేసుకుంటే మొటిమ‌లు సులువుగా తొల‌గిపోతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: