మ‌నం ప్ర‌తి రోజు రిలాక్స్ కోసం ఒక క‌ప్పు కాఫీ తాగ‌డం అల‌వాటు. కాఫీ పౌడర్‌తో చాలా ఉపయోగాలున్నాయి. ప్రతిరోజూ దీర్ఘకాలము కాఫీ తాగ‌డం వ‌ల్ల‌ గుండెజబ్బులు, మధుమేహము వచ్చే అవకాశము తగ్గుతుంది. కాఫీ కేవలం అలసటను తీర్చడానికే కాదు అందంపెంచడానికి ఉపయోగపడుతుంది. 


కాఫీ లోని కెఫిన్ ఉంటుంది.  దీని వ‌ల్ల పనిలో ఏకాగ్రత, చురుకుతనము, జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి. అలసటను తగ్గిస్తుంది. అలాగే కెఫిన్‌ క్యాస్సర్ వచ్చే అవకాశాలు తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే  ప‌రిమితికి మించి కాఫీ తాగ‌కూడ‌దు. అలాగే కాఫీతో ఆరోగ్య‌మే కాదు.. చ‌ర్య సౌంద‌ర్యాల‌కు కూడా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. 


కాఫీ ప‌వ‌డ‌ర్ వ‌ల్ల స్క్రబ్, మాస్క్, క్లీన్సర్ లా వివిధ రకాలుగా మీ చర్మాన్ని సంరక్షిస్తుంది. కెఫైన్ లో చర్మానికి పోషణాలిచ్చే ఎబిలిటీస్ ఉన్నాయి. ఇవి చర్మాన్ని హెల్తీగా ఉంచుతూ చర్మ సౌందర్యాన్ని సంరక్షిస్తూ ఉంటాయి. మ‌రి అది ఎలాగో తెలుసుకుందాం..


- ఒక స్పూన్ కాఫీ ప‌వ‌డ‌ర్‌లో కొంచెం తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి బాగా మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత వాష్ చేసుకుంటే ముఖం నిగారింపుగా, అందంగా క‌నిపిస్తుంది.


- కాఫీ ప‌వడ‌ర్‌, అలోవెరా జెల్ క‌లిపి ఫేస్‌కు మాస్క్ వేసుకోవాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత క్లీన్ చేసుకుంటే ముఖంపై మ‌చ్చ‌లు, మొటిమ‌లు తొల‌గిపోతాయి.


- రెండు స్పూన్ల కాఫీ ప‌వ‌డ‌ర్‌లో కొంచెం తేనె మిక్స్ చేసి ఫేస్‌కు అప్లై చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం తేమ‌గా మ‌రియు అందంగా మారుతుంది.


- కొంచెం కాఫీ పౌడర్, పెరుగు, ఓట్‌మిల్ పౌడర్, తేనె కలిపి మెడకు, ముఖానికి రాసుకొని ఓ అరగంట పాటు ఉంచుకోవాలి. దీంతో మీ స్కిన్ మృదువుగా మారుతుంది. 


- ఆలివ్ ఆయిల్, కాఫీ పౌడర్ మిక్స్ చేసి ముఖానికి రాసుకొని ఓ పదినిమిషాల పాటు ఉంచి కడిగితే చర్మం పొడిబారకుండా స‌హాయ‌ప‌డుతుంది.


- కాఫీ ప‌వ‌డ‌ర్‌లో కొంచెం పంచ‌దార‌, కొబ్బ‌రి నూనె మిక్స్ చేసి ఫేస్ మాస్క్ వేసుకొని కొంత స‌మ‌యం త‌ర్వాత వాష్ చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల డార్క్ స‌ర్కిల్స్ మాయం అవుతాయి.


- కాఫీని ఐస్ క్యూబ్స్ లో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి.  ఆ క్యూబ్స్ తీసుకుని ముఖంపై స్లోగా మర్దనా చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల బ్ల‌డ్ స‌ర్కులేష‌న్ మెరుగుప‌డి ముఖం గ్లోగా మారుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: