మీ  ఉప్పు తిన్నాను గనుకనే మీపై విశ్వాసం ఉంచుతున్నాను అంటూ సినిమాలో, నిజజీవితంలో ఎన్నో డైలాగులు వింటూ ఉంటాం. కానీ ఉప్పు తిన్నందుకు మనిషే కాదు మనిషి శరీర భాగాలు కూడా విశ్వాసం చూపిస్తాయట. శరీర భాగాలు విశ్వాసం చూపించడం ఏమిటి అనుకుంటున్నారా. ఇందులో ఉన్న అర్థం ఏమిటంటే. ఉప్పు ఆరోగ్యానికో ఇతరాత్రా పనులకి ఎలా ఉపయోగపడుతుందో అలాగే అందాన్ని మెరుగు పరిచే విషయంలో కూడా సూపర్ డూపర్ గా పనిచేస్తుంది. ఇది అసలు సంగతి. మరి అందానికి ఉప్పు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం..

 Image result for salt beauty tips

చర్మ తాజగా ఉండాలంటే ఉప్పుని మించిన ఆయుధం మరేది లేదని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఎలా అంటే. కప్పు వేడి నీళ్ళలో స్పూన్ ఉప్పు వేయాలి. ఇలా కలిసిన మిశ్రమాన్ని మెత్తటి దూదితో అద్ది ముఖం  మొత్తం శుభ్రంగా రుద్దుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం కోమలత్వాన్ని సంతరించుకుని, తాజాగా ఉంటుంది.

 Image result for salt for nails

చాలా మందికి పళ్ళు పసుపు పచ్చగా ఉంటాయి. మరి కొంతమందికి గార పట్టి ఉంటాయి. అలాంటి వారు కొంచం ఉప్పు, షోడా ఉప్పుని కలిపి చేతిలో వేసుకుని బ్రెష్ తో శుభ్రంగా చేసుకుంటే పళ్ళు తెల్లగా మారుతాయి. అంతేకాదు చాలా మంది తమ కాలి, చేతి గోళ్ళ గురించి శ్రద్ద వహించరు దాంతో గోళ్ళు మురికిగా, అంద విహీనంగా కనిపిస్తాయి. అలాంటి వారు పాదాలు పట్టే విధంగా ఒక బేసిన్ లోకి గోరు వెచ్చని నీళ్ళు తీసుకుని. అందులో ఒక స్పూన్ ఉప్పు, రెండు స్పూన్ల షోడా ఉప్పు, ఒక నిమ్మ కాయ రసం పిండి పదాలు లేదా చేతులు అందులో  పావు గంట పాటు ఉంచాలి. తరువాత బ్రష్ తో రుద్దితో సులభంగా మురికి పోయి గోళ్ళు అందంగా కనిపిస్తాయి.  

 


మరింత సమాచారం తెలుసుకోండి: