స‌హ‌జంగా చాలా మంది మ‌హిళ‌లు అనేక చ‌ర్మ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుంటారు. ముఖం పొడిబారిపోవ‌డం, మ‌చ్చ‌లు, మొటిమ‌లు ఇలాంటి స‌మ‌స్య‌ల‌తో బ‌య‌ట‌కు వెళ్లాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అయితే మీగ‌డ ఆరోగ్యానికి, అందానికి చాలా బాగా స‌హాయ‌ప‌డుతుంది. మీగ‌డ‌తో చ‌ర్మానికి ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. 


ముఖ్యంగా ఎక్కువ రోజులు నిలువ ఉంచిన మీగ‌డ అయితే మంచి ఫ‌లితాల‌ను అందిస్తుంది. ఇది చర్మానికి చక్కని మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. మీగ‌డ మాయిశ్చరైజర్‌గానే కాదు అందాన్ని మెరిపించుకోవ‌డంతో చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. మ‌రి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..


- మీగ‌డ‌లో కొద్దిగా నిమ్మ ర‌సం క‌లిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత వాష్ చేసుకుంటే ఫేస్‌పై ఉన్న న‌ల్ల‌టి మ‌చ్చ‌లు తొల‌గుతాయి.


- ప్ర‌తి రోజు మీగ‌డ‌తో కాసేపు మ‌సాజ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అది చ‌ర్మంలోకి వెళ్లి మృత క‌ణాల‌కు జీవం పోస్తుంది.


- మీగ‌డ‌లో కొద్దిగా తేనె క‌లిపి ఫేస్‌కు రాసుకోవాలి. త‌ర‌చూ ఇలా చేయ‌డం వ‌ల్ల తేనెలోని మినరల్స్‌, మీగడలోని గుణాలు ముఖాన్ని మెరిసేలా చేస్తాయి.


-  మీగడలోని లాక్టిక్‌ యాసిడ్ చ‌ర్మాన్ని కాంతివంతంగా ఉంచేందుకు దోహ‌దం చేస్తుంది. మీగ‌డ‌ను రాసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మ‌పై పేరుకున్న మురికిని తొలిగిస్తుంది.


- మీగ‌డ‌ను ముఖానికి రాసుకోవ‌డం వ‌ల్ల అందులో ఉండే ప్రోటీన్లు, విట‌మిన్లు చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా ఉండేలా స‌హాయం చేస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: