కరివేపాకు ఆరోగ్యానికే కాదు, కేశాల సంరక్షలో సైతం ఉపయోగపడుతుంది. సహజంగా కూరలో కరివేపాకు వస్తే తీసి పడేస్తాం, అసలు కరివేపాకు ని చూస్తేనే చాలా మందికి ఎలర్జీగా ఉంటుంది . కానీ ఇది ఆరోగ్య సంరక్షలో కానీ జుట్టు ఎదుగుదల, తెల్లబడిన జుట్టుని నల్లబరచటంలో గానీ ఎంతో అద్భుతంగా పని చేస్తుంది. మరి కరివేపాకు తో తెల్ల చుట్టుని ఎలా నల్లగా నిగనిగ లాడేలా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

 

స్వచ్చమైన కొబ్బరి ముక్కలతో చేసిన కొబ్బరి నూనె తీసుకుని అందులో ఒక కొద్ది మొత్తంలో కరివేపాకు వేసి మరిగించాలి. పూర్తిగా చల్లారిన తరువాత అది తలకి రాసుకుని సుమారు అరగంట పాటు ఉంచి తల స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే తప్పకుండా తెల్ల బడే జుట్టు నల్లబడుతుంది.

 

కరివేపాకు ని ఎండలో పెట్టి బాగా పొడిగా చేసుకోవాలి. ఇలా పొడి అయిన తరువాత పావు కిలో కొబ్బరి నూనెలో కానీ లేదంటే ఆలివ్ ఆయిల్ లో కానీ వేసుకోవాలి. అందులోనే మెంతుల పొడి కూడా కలుపుకుని ఒక 10 రోజుల తరువాత జుట్టుకు పట్టిస్తే, జుట్టు బలమైన ఎదుగుదలతో పాటు నల్లగా నిగనిగలాడుతుంది. ఈ చిట్కాలు క్రమం తప్పకుండా పాటిస్తే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు.

 

అంతేకాదు జుట్టు తెల్లబడటానికి మరొక కారణం శరీరంలో B 12 విటమిన్ లోపం కూడా ఒకటి అవుతుంది. ఒక్క సారి B 12 విటమిన్ లెవల్స్ చెక్ చేసుకుని అందుకు తగ్గట్టుగా వైద్యుల సలహా మేరకు మందులని వాడుతూ ఈ చిట్కాలని పాటిస్తే మరింత తొందరగా జుట్టు నల్లబడుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: