చాలా మందికి చర్మ జిడ్డుబారుతుంది. ముఖానికి నూనె రాసుకున్నట్టుగా ఆయిల్ ఫేస్ తో చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు బయటకి వెళ్ళాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటారు. అమ్మాయిల్లో ఈ సమస్య  మరీ ఎక్కువగా ఉంటుంది. మరి ఈ సమస్య నుంచీ బయట పడాలంటే ఎలా. జిడ్డు చర్మాన్ని కాంతివంతంగా  చేయడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.

 

నిమ్మకాయలు సహజంగా అన్ని సమయాల్లో వాడుతారు. తినే పదార్ధాలలో, ఆయుర్వేద మందులలో, ఆరోగ్య నియమాలు పాటించే ప్రతీ పద్దతిలో నిమ్మకాయ సాయం ఎంతో ఉంటుంది. సౌందర్య సంరక్షణలో నిమ్మకాయ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మార్కెట్ లో దొరికే ఫేస్ మాస్క్, ఫేస్ లోషన్స్ లో నిమ్మకాయ తప్పని సరిగా ఉంటుదని. నిమ్మకాయ మిళితంతో చేసుకునే ఫేస్ మాస్క్ లు కొనుక్కునే అవసరం లేకుండా మన ఇంట్లోనే సహజసిద్ద పద్దతుల ద్వారా చేసి జిడ్డు చర్మం నుంచీ విముక్తి పొందవచ్చు.

 

నిమ్మకాయ, సోడా ఉప్పు, తేనే లతో జిడ్డు చర్మ పోగొట్టే విధానం :

చర్మం జిడ్డుగా ఉంటే చాలా చిరాకుగా ఉంటుంది. మన దగ్గర కర్చీఫ్ లు సైతం వెగటు పుట్టించే వాసన వచ్చేలా మారిపోతాయి.  అనేకాదు ఇలా జిడ్డుగా ముఖం ఉండే వారికి మొటిమలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఈ సమస్యలకి చెక్ పెట్టాలంటే. ఒక చెంచాడు నిమ్మరసం తీసుకుని, అందులో ఒక చెంచాడు తేనే వేయాలి, అందులోనే  అర చెంచాడు సోడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇలా చేయగా వచ్చిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఒక అరగంట పాటు ఉంచి గోరు వెచ్చని నీటితో కడిగేస్తే కాంతి వంతమైన చర్మ మీ సొంత అవుతుంది.    

 


మరింత సమాచారం తెలుసుకోండి: