చందనము ఒక విశిష్టమైన సుగంధాన్నిచ్చే వృక్షం. చందనము వ్యాధి నిరోధక శక్తిని మరియు మేధస్సును పెంచే గుణము కలది. చందనపు చెక్కనుండి తీసిన తైలం మంచి సువాసన కలిగి పరిమళ ద్రవ్యముల తయారీలో బాగా వాడుతున్నారు. ఇది మెదడు, హృదయమునకు సంబంధించిన వ్యాధులకు, కడుపులో మంట, జ్వరము, తలనొప్పి, జలుబు, శ్వాసకోశ, మూత్రకోశ,  మరియు ఇతర చర్మవ్యాధులకు సంబంధించిన మందుల తయారీలో ఉపయోగపడును.


అయితే కేవ‌లం ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా చంద‌నాన్ని ఉప‌యోగిస్తారు. కొన్ని రకాల పెర్‌ఫ్యూమ్‌లలోనూ చందనం ఉంటుంది. అలాగే చంద‌నం చ‌ర్మ సౌంద‌ర్యాల‌కు చాలా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ముఖంపై ఏర్పడిన మచ్చలు, మొటిమలు పోగొట్టి నిగారింపు తీసుకురావడంలో చందనానికి సాటి లేదు. మ‌రి చంద‌నంతో అందాలు ఇప్పుడు తెలుసుకుందాం..


- గంధం పొడి కొద్దిగా ప‌సుపు, తేనె క‌లిపి ముఖానికి ఫ్యాక్‌లా వేసుకోవాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత వాష్ చేసుకుంటే ముఖంపై మురికి తొల‌గి కాంతివంతంగా క‌నిపిస్తుంది.


- గంధం పొడిలో కొద్దిగా రోజ్ వాట‌ర్ మిక్స్ చేసి ముఖానికి రాసుకోవాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల మొటిమ‌ల స‌మ‌స్య త‌గ్గుతుంది.


- గంధం పొడిలో కొద్దిగా కొబ్బ‌రి నూనె, బాదం నూనె క‌లిపి ముఖానికి, మెడ‌కి రాసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి టోన్ పొంద‌వ‌చ్చు.


- గంధం పొడిలో కొద్దిగా పాలు యాడ్ చేసి ఫేస్‌కు అప్లై చేయాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల ముఖం కాంతివంతంగా, అందంగా మారుతుంది.


- గంధంలో ప‌న్నీరును వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మానికి అప్లై చేసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మంపై ఉన్న మ‌చ్చ‌లు, మ‌లినాలు తొల‌గి నిగారింపుగా క‌నిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: