సాధార‌ణంగా అందాన్ని సంర‌క్షించుకోవ‌డానికి ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.  బ్యూటీ పార్ల‌ర్‌కి వెళ్లడం లేదా రకరకాల ఫేస్ ప్యాక్స్ వేసుకోవ‌డం లాంటివి చేస్తుంటారు. అయితే వాటిని ప‌క్క‌న పెట్టి ఇంట్లోనే ఐస్ క్యూబ్స్‌తో మ‌నం అందాన్ని పొంద‌వ‌చ్చు.  ఐస్ క్యూబ్స్ కేవలం డ్రింక్స్‌కు మాత్రమే ఉపయోకరం కాదు. ఎన్నో చ‌ర్మ సౌంద‌ర్యాల‌కు ఉప‌యోగ‌క‌రం. మ‌రి అవేంటో ఓ లుక్కేస్తే పోలా..!


- నిద్రలేమి కారణంగా కళ్లు ఉబ్బినట్లు అవుతుంటాయి. ఐసుముక్కల్ని ఒక క్లాత్‌లో వేసి మూటలా క‌ట్టి కళ్లపై కాసేపు ఉంచ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య త‌గ్గుతుంది.


- ఐస్ క్యూబ్స్‌తో మర్దన చేస్తున్నట్లుగా ముఖమంతా రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం పరిశుభ్రంగా మారడమే కాదు, మృదువుగానూ కనిపిస్తుంది.


- ముఖంపై మొటిమల వ‌ల్ల నొప్పితో బాధ‌ప‌డుతుంటారు. అప్పుడు ఒక క్లాత్‌లో ఐస్ ముక్కల్ని ఉంచి నొప్పి పెడుతున్న భాగంలో అద్దాలి. ఇలా చేస్తే మొటిమలు, మొటిమ‌ల వ‌ల్ల వ‌చ్చే నొప్పి తగ్గుతాయి.


-  చర్మం సాగినట్టుగా ఉన్న ప్రాంతాల్లో ఐస్‌‌ను ఉంచి మృదువుగా రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని విషతుల్యాలు బయటకు వెళ్లిపోయతాయి. చర్మం బిగుతుగా మారుతుంది.


- వెనిగర్‌లో కాటన్‌క్లాత్‌ను ముంచి ముఖానికి ఆప్లై చేసుకొని ఐస్‌ క్యూబ్స్‌తో మర్ధన చేసుకుంటే ముఖం నిగారింపుగా మారుతుంది.


- సాధార‌ణంగా మురికి, కాలుష్యం కారణంగా ముఖం జిడ్డుగా కనిపిస్తుంటుంది. అలాంటి స‌మ‌యంలో ఐస్ క్యూబ్స్‌తో ముఖంపై మ‌సాజ్ చేయడం వ‌ల్ల ఆ స‌మ‌స్య త‌గ్గ‌తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: