ఈ మధ్య ఆలివ్ ఆయిల్‌ వినియోగం చాలా ఎక్కువ అవుతోంది. ఇత‌ర నూనెల‌తో పోలిస్తే ఆలివ్ ఆయిల్ ధ‌ర చాలా ఎక్కువ‌నే ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఆహారానికి ఆలివ్ నూనె ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది. అలాగే ప్రత్యేకమైన ఫ్లేవర్‌నూ జోడిస్తుంది. అయితే అది అందించే ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఎన్నో కీల‌క పోష‌కాలు ఆలివ్ ఆయిల్‌లో ఉన్నాయి. మ‌రి ఆలీవ్ ఆయిల్ కేవ‌లం ఆరోగ్యానికి మాత్ర‌మే అనుకుంటే పొర‌పాటే. ఆలివ్ ఆయిల్ చ‌ర్మ సౌందర్యానికి ఎంతో చక్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.


ఆలివ్ నూనె తేమను నిలబెట్టుకోవడం మరియు పొడి మరియు వాతావరణం, చిలికిన చర్మం కోసం జాగ్రత్త వహిస్తుంది. ఆలివ్ నూనె కొవ్వు చర్మాన్ని సంపూర్ణంగా పోషిస్తుంది, రంధ్రాల అన్క్లాగింగ్ మరియు అదే సమయంలో అవసరమైన అన్ని అంశాలను అందిస్తుంది. ఇంకా ఎన్నో ఉప‌యోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


- పొడిచర్మం ఉన్నవారు ఆలివ్‌ఆయిల్‌లో నిమ్మరసాన్ని కలిపి ముఖానికి త‌ర‌చూ రాస్తూంటే ముఖ చర్మం తేమగా ఉంటుంది. కాంతిగానూ, మృదువుగానూ మారుతుంది.


- జుట్టు పొడిబారకుండా ఉండాలంటే కొబ్బరి నూనె, ఆలివ్‌నూనె, ఆముదాలను సమపాళ్ళలో తీసుకుని బాగా మిక్స్ చేయాలి. దీన్ని తలస్నానం చేయడానికి ఒక గంట ముందు తలకు బాగా పట్టించి తరువాత తలస్నానం చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.


- స్నానం చేయబోయే ముందు పిల్లలకు ఆలివ్‌ఆయిల్‌ను ఒంటికి పట్టించి, మృదువుగా మర్దనా చేసి, మెత్తని సెనగపిండితో రుద్ది స్నానం చేయిస్తే పిల్లల లేతచర్మం ఎంతో కాంతిగా, ఎముకలు దృఢంగా, రక్తప్రసరణ బాగా జరుగుతుంది.


- ఆలివ్ ఆయిల్‌ను గోళ్ళమీద ప్రతిరోజూ రాస్తూంటే, గోళ్ళ దృఢత్వం, అందం పెరుగుతాయి.


- ఆలివ్‌ఆయిల్‌లో రోజ్ వాట‌ర్‌ను కలిపి పెదాలకు రాస్తుంటే, పెదాలు పగలవు, మంచిరంగుతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.


- ఆలివ్‌ ఆయిల్‌తో తేనెను కలిపి ముఖానికి రాసి, కొంతసేపయిన తర్వాత ముఖాన్ని మెత్తని సున్నిపిండితో రుద్దుకుని కడుక్కుంటే ముఖవర్ఛస్సు పెరుగుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: