ఇటీవల కాలంలో మనలో చాలా మంది ముఖ సౌందర్యం విషయమై పలు రకాల క్రీమ్స్ వాడడం చూస్తున్నాం. అయితే అటువంటివి అవసరం లేకుండా, మనకు మార్కెట్ లో లభ్యమయ్యే సహజ సిద్దమైన కీరదోస వంటి వాటితో ముఖాన్ని ఎంతో కాంతివంతంగా మార్చుకోవచ్చు. నిజానికి మన శరీరానికి కీర దోసకాయ ఎంతో చలువ చేయడంతో పాటు, శరీరానికి కావలసిన నీరును కూడా అందిస్తుంది. అందుకే ఎక్కువగా ఎండా కాలంలో కొంతమంది కీరదోస జ్యూస్ తాగుతుంటారు. అంతేకాదు కీరదోసకాయలో మన ఫేస్ లో ముడతలు మరియు చారలు తగ్గించే శక్తి కూడా ఉందని సౌందర్య నిపుణులు చెపుతున్న మాట. 

అయితే కీరదోసను ఉపయోగించి మన ముఖానికి ఒక ఫేస్ ప్యాక్ చేసుకుని అప్లై చేస్తే మెల్లగా కొద్దిరోజుల తరువాత మొహంపై ముడతలు తగ్గుముఖం పడతాయట. అందుకోసం కొన్ని కీరదోసకాయలను ముక్కలుగా కోసుకుని, వాటిని మిక్సీ పట్టి, ఆ గుజ్జును వడకట్టి, పిప్పి మొత్తం తీసేయాగా వచ్చిన రసాన్ని తీసుకుని, అందులో ఒక స్పూన్ అలోవెరా జెల్, ఒక స్పూన్ పెరుగు కలిపి, బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని మన ముఖంపై ముడతలు వున్న చోట కనుక బాగా మర్దన చేస్తూ అప్లై చేసి, కాసేపటి తరువాత కడిగేయాలి. ఈ విధంగా కొన్నాళ్ల పాటు రోజూ చేస్తే, ముడతలు కొద్దిరోజుల్లోనే తగ్గుముఖం పెట్టె అవకాశం ఉందంటున్నారు. 

ఇక మరొకటి విధానం ప్రకారం, కొంచెం కీరదోస రసం తీసుకుని, అందులో ఒక స్పూన్ ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్, మూడు విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకుని, మూడింటిని బాగా మిక్స్ చేసుకుని ముడతలు మరియు మచ్చలు వున్న చోట కనుక నిత్యం కొద్దిరోజుల పాటు మర్దన చేస్తూ అప్లై చేస్తే అవి మెల్లగా తగ్గడంతో పాటు ముఖం ఎంతో కాంతివంతంగా మిలమిలా మెరిసిపోతూ, మన వయసు కూడా చాలావరకు తగ్గినట్లు కనపడుతుందట. సో విన్నారుగా ఫ్రెండ్స్, మనకు ఎంతో ఉపయోగకరమైన ఈ చిట్కాను మీరు కూడా ఆచరించి మంచి ఫలితాలు పొందండి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: