మనిషి అందంగా, ఆకర్షణీయంగా కనబడటంలో తల వెంట్రుకలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడో లేదో తెలుసుకోవాలంటే అతని జుట్టును చూస్తే తెలిసిపోతుందంటున్నారు నిపుణులు. వెంట్రుకలు పెరగడం, రాలడం సర్వసాధారణం. కానీ కొందరిలో జుట్టు రాలటం అధికంగా ఉంటుంది. ఆడ వారితో పోలిస్తే మగ వారిలో జుట్టు ఎక్కువగా రాలిపోతుంది.


ప్రస్తుత రోజుల్లో వెంట్రుకలు రాలినంత త్వరగా పెరగడం లేదు. దానికి విటమిన్ లోపం, ఒత్తిడి, కాలుష్యం లాంటివి ముఖ్యకారణాలు. మరి రాలిన జుట్టు త్వరగా పెరగాలి అని కోరుకుంటారు. అయితే మీ కేశాలకు అధిక పోషకాలను అందించడానికి కనీసం వారానికి రెండు సార్లు అయినా తలకు వంటనూనెలను అప్లై చేయాలంటున్నారు సౌందర్య నిపుణులు.


మరి ఆ కుకింగ్ ఆయిల్స్ ఏమిటో ఓ లుక్కేస్తే పోలా.. తల చర్మం, జుట్టు సంరక్షణలో అద్భ‌తంగా పనిచేసే కుకింగ్ ఆయిల్ కొబ్బరినూనె. ఈ నూనె జుట్టుకు మంచి కండీషనర్ గా పనిచేయడమే కాక ఒత్తుగా పెరగడానికి కూడా సహాయపడుతుంది. బాదం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. త్వరగా జుట్టు పెరగాలనుకొనే వారు బాదం నూనెను ప్రతిరోజు తలకు పట్టించాలి. జుట్టు సంరక్షణలో ఆలివ్ ఆయిల్ అద్భుతంగా పని చేస్తుంది. ఇది జుట్టుకు అవసరమయ్యే తేమను, పోషకాలను అందిస్తుంది.


ఇది కండిషనర్ గా పనిచేయడమే కాక చుండ్రును కూడా నివారిస్తుంది. ఆలివ్ ఆయిల్ కు కొద్దిగా తేనేను మిక్స్ చేసి అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుందని హెయిర్ స్పెషలిస్టులు అంటున్నారు. ఒత్తైన నల్లని జుట్టు పొందాలంటే మస్టర్డ్ ఆయిల్ ( ఆవనూనె ) ను ఉపయోగించవచ్చు. ఈ ఆయిల్ తలలో బ్లడ్ సర్కులేషన్ ను పెంచి జుట్టు పెరగడానికి సహాయంచేస్తుంది. జుట్టు సంరక్షణకు నువ్వులనూను మంచి ఛాయిస్.


నువ్వులనూనెతో తలకు మసాజ్ చేస్తే.. తలలో రక్త ప్రసరణ పెరిగి జుట్టు పెరగడం ప్రారంభమవుతుంది. జుట్టు సంరక్షణలో సన్ ఫ్లవర్ ఆయిల్ … కొబ్బరినూనంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుందంటున్నారు బ్యూటీషియన్లు. డ్రై హెయిర్ ఉన్నవాళ్లు కనోలా అనే కుకింగ్ ఆయిల్ ను ఉపయోగించాలి. ఇది పొడి జుట్టును నివారించి, స్మూత్ గా మెరిసేలా చేస్తుంది. అలాగే, జుట్టు ఉడడాన్ని, కొసలు చిట్లడాన్ని తగ్గిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: