సాధార‌ణంగా డెలివ‌రీ తర్వాత మహిళల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. శ‌రీర ఆకృతి మారుతుంది. దీంతో మునుపటి అందాన్ని కోల్పోతారు. దీని వ‌ల్ల కొంద‌రు ఇబ్బంది ప‌డుతుంటారు. తిరిగి అందాన్ని పొంద‌డానికి ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తారు. డెలివ‌రీ జరిగిన తర్వాత మొహంలో కాంతి తగ్గిపోతుంది.  శరీరానికి కావల్సిన ఆంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల తిరిగి కాంతివంతంగా మారవచ్చు. యాంటీ ఆక్సీడెంట్లు బెర్రిస్, రేగుపళ్ళు, ఆరెంజ్ పళ్ళు, ఎండుద్రాక్ష వంటి వాటిలో ఎక్కువగా ఉంటాయి.


ప్రసవాన్ని తర్వాత వచ్చే హార్మోన్ అసమతుల్యం వల్ల ముఖం మీద నల్లటి మచ్చలు వచ్చే అవకాశం ఉంది. వీటిని పోగొట్టుకోవడానికి ఫేస్‌ప్యాక్స్ తరచుగా వేసుకోండి. దీనికి వెల్లుల్లీ పేస్ట్‌ లేదా ఆరెంజ్ తొక్కను ఫేస్ మీద అప్లై చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కళ్ళ కింద వలయాలు వచ్చే అవకాశం ఉంది. దీనికి బేబి ఎప్పుడు నిద్రపోతుందో అప్పుడే మీరు కూడా నిద్రపోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మీకు బాగా విశ్రాంతి పొంది స్ట్రెస్ త‌గ్గుతుంది.


అలాగే దోస ముక్కలను, టీ బ్యాగ్‌లను కళ్ళ కింద పెట్టుకోవ‌డం వ‌ల్ల క‌ళ్ళ కింద ఉన్న న‌ల్ల‌టి వ‌ల‌యాలు తొల‌గించ‌వ‌చ్చు. ప్రసవం జరిగిన తర్వాత మహిళల పొట్ట మీద మార్క్స్ రావడం సహజం ఆముదం లేదా ఆలివ్ ఆయిల్‌తో మర్ధనా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ప్ర‌తి రోజు బ‌రువు త‌గ్గ‌డానికి కొంత స‌మ‌యం వ్యాయామం చేయాలి. మ‌రియు డెలివ‌రీ త‌ర్వాత ఎక్కువ శాతం నీటిని తీసుకోవాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: