చాలా మంది ముఖ సౌందర్యానికి ఇచ్చినంత ప్రాధాన్యత పాదాల సంరక్షణకు ఇవ్వ‌రు. దీంతో చాలామందికి ముఖం ఎంత అందంగా ఉన్నా పాదాలు పొడిబారి, పగుళ్ళతో కనిపిస్తాయి. అలానే వదిలేస్తే పగుళ్లు ఎక్కువై నడుస్తుంటే నొప్పి కూడా వస్తుంది. ఈ సమస్య వానాకాలంలో ఎక్కువగా ఉంటుంది. అప్పుడు బయట దొరికే క్రీములు వాడినా వాటితో తాత్కాలికంగానే ఉపశమనం కలుగుతుంది.


పాదాల పగుళ్ళను నివారించుకోవాలంటే కొంచెం శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే పాదాల సంరక్షణ మన వ్యక్తిగత పరిశుభ్రతలో కూడా ఒక భాగం. కాబట్టి ఈ సమస్య పూర్తిగా శాశ్వతంగానే పరిష్కరించుకోవాలి. అయితే పాదాల సమస్యకు కాఫీ పొడి బాగా పనిచేస్తుంది. కాఫీ పొడి మంచి ఘుమ ఘుమ‌లాగే సువాస‌న‌ను వెద‌జ‌ల్ల‌డ‌మే కాదు.. అందులో ఆరోగ్య-సౌందర్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి కాఫీ పొడి ద్వారా అందాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. అలాగే పాదాల సంరక్షణలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇంత‌కు కాఫీపొడిని ఎలా ? యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..


ముందుగా ఒక గిన్నెలో కాఫీ పౌడర్, వేడి నీళ్లు కలిపి పేస్టులా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొబ్బరినూనె, బేబీ షాంపు కూడా చేర్చి బాగా కలపాలి. ఆ తర్వాత పాదాలను నీటితో శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ముందుగా త‌య‌రు చేసుకున్న‌ మిశ్రమాన్ని పాదాలకు లేపనంగా రాయాలి. అరగంట తర్వాత పాదాలను స్క్ర‌బ్‌ చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పాదాల పగుళ్లు తగ్గి మృదువుగా,అందంగా మారతాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: