అందంగా ఉండాల‌ని అంద‌రూ కోరుకుంటారు. అయితే వ‌ర్షాకాలంలో ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా చ‌ర్మం  సహజమెరుపును కోల్పోయి అందవిహీనంగా తయారవుతుంది. ఒకింత నల్లగా మారుతుంది కూడా. దీని కోసం ఎంతో ఖ‌ర్చు  ఏవేవో ఫేస్ క్రీములు వాడుతుంటారు. అయినా ఏ మాత్రం ప్ర‌యోజ‌నాలు క‌నిపించ‌వు. ఇలాంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే. మ‌రి అవేంటో ఓ లుక్కేయండి..


- గోరువెచ్చటి పాలలో మెత్తటి వస్త్రాన్ని ముంచి దాంతో ముఖంపై అద్దాలి. బాగా ఆరిపోయాక చల్లటి నీళ్లతో కడిగెయ్యాలి.  దీంతో మెరుపు కోల్పోయిన చర్మం సహజమెరుపును సంతరించుకుంటుంది.


- ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మారోగ్యాన్ని సంరక్షిస్తాయి. అవి పుష్కలంగా లభ్యమయ్యే పాలు, చేపలు, వాల్‌నట్స్‌, సోయా, అవిసె గింజలు ఆహారంలో భాగం చేసుకోవాలి.


- పెరుగులో నాలుగైదు చుక్కల నిమ్మరసం వేసి ముఖానికి రాయాలి. ఈ మిశ్రమం మంచి బ్లీచింగ్‌ ఏజెంట్‌లా పనిచేస్తుంది.


- పాలల్లో శనగపిండి, పసుపు కలపండి. దీన్ని ముఖానికీ మెడకూ పట్టించండి. ఐదు నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగెయ్యండి. జిడ్డు చర్మం గలవారికి ఈ ప్యాక్‌ బాగా పనిచేస్తుంది.


- పెరుగులో తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఐదునిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగెయ్యండి. పొడిచర్మం గలవారికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.


- దోసకాయ రసంలో కొద్దిగా పెరుగు కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి  అప్లై చేసి ఐదు నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో క్లీన్ చేయాలి. ఈ ప్యాక్ వ‌ల్ల‌ ముఖం కాంతివంతంగా తయారవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: