సాధార‌ణంగా స్త్రీలు తమ సౌందర్యానికి ఎంతో ప్రాముఖ్య‌తని ఇస్తుంటారు. నెలకి ఒకసారి  బ్యూటీ పార్లర్ కి వెళ్ళడం, అలానే అప్పుడప్పుడు ఇంట్లో కూడా చిన్నచిన్నచిట్కాలు, ఇంట్లోనే ఫేషియల్స్ చేయించుకోడం లాంటివి చేస్తుంటారు. ఒక్కోసారి ఆడవాళ్ళకి.. అందానికి అక్రమ సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయితే అందం కోసం ఎంతాగానో ఖ‌ర్చు పెడుతుంటారు. వాస్త‌వానికి పెద్దగా ఖ‌ర్చు లేకుండా మన వంటింటి చిట్కాల‌తోనే మ‌చ్చ‌లు లేని మెరిసే చ‌ర్మం సొంతం చేసుకోవ‌చ్చు. మ‌రి అవేంటో ఓ లుక్కేస్తే పోలా..


- టమాటా రసం తీసుకొని, అందులో కొద్దిగా బియ్యపు పిండి కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. కొంత స‌మ‌యం తర్వాత గోరువెచ్చని నీళ్లతో వాస్ చేసుకోవ‌డం వల్ల అందమైన నిగనిగలాడే చర్మం పొంద‌వ‌చ్చు.


- బీట్‌రూట్‌ రసానికి కొంచెం తేనె కలిపి, పెదాలకు రాసుకుని పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇలా రోజూ రాత్రి పడుకునే ముందు రాస్తే పెదాలు మృదువుగా మారతాయి.


- ఒక స్పూన్ గంధంలో, ఒక స్పూన్ తేనే కలిపి బాగా మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి రాసుకొని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల ముఖంపై మ‌చ్చ‌ల‌ను నివారించ‌వ‌చ్చు.


- ఒక స్పూన్‌ నిమ్మరసం తీసుకొని , అందులో కొద్దిగా షుగ‌ర్ వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి 15నిమిషాలు త‌ర్వాత‌ నీళ్లతో నెమ్మదిగా రుద్దుతూ కడిగేయడం వల్ల చర్మంపై ఉన్న మృతకణాలు పోయి చర్మము మెరుస్తుంది.


- పచ్చి పాలను తీసుకొని, అందులో కొంచెం పసుపు వేసుకొని ముఖానికి మ‌రియు మెడకు అప్లై చేసి కొంత స‌మ‌యం తర్వాత చల్లని నీళ్లతో వాష్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ మృదువైన మెరిసే చర్మం పొంద‌వ‌చ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: