అందంగా కనిపించాలని ఎవరు మాత్రం అనుకోరు. కానీ చాలా మంది చర్మంపై వచ్చే మచ్చలు, మొటిమలు వల్ల అందంగా ఉన్నా సరే అందవిహీనంగా కనిపిస్తారు. అంతేకాదు చర్మంపై వచ్చే పులిపిర్లు తో ముఖంతో ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. మొటిమలు ఒక రోజు కాకపోయినా మొరొక రోజయినా తగ్గుతాయి కానీ ముఖంపై వచ్చే పులిపిర్లు, మచ్చలు మాత్రం అంత తొందరగా తగ్గవు. అయితే ఈ సమస్య తో భాధపడే వారు ఈ సమస్య నుంచీ బయటపడటానికి  అద్భుతమైన పురాతన పద్దతి అందుబాటులో ఉంది.

 

ఇంట్లోనే దొరికే ఓ పదార్ధంతో ఈ సమస్యని పారదోలచ్చు. మనం నిత్యం కూరల్లో వాడే ఆవాలు వీటిని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాదు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. శరీరంపై ఏర్పడే మచ్చలు, కురుపులకి తగ్గించడంలో ఆవాలు దివ్యమైన ఔషధంలా పని చేస్తాయి. అంతేకాదు విపరీతమైన దురదతో బాధపడే వారికి కూడా ఆవాల చికిత్స మేలు చేస్తుంది.

 

ఆవాలు పొడి చేసి దాన్ని కురుపులు , మచ్చలపై , దురదలు వచ్చే ప్రదేశంలో రాయడం వలన సమస్యలు అన్నీ పారిపోతాయి. పొడి లో కొంచం వేప నూనె కానీ, ఆవ నూనె రెండు చుక్కలు వేసుకున్నా పరవాలేదు. అంతేకాదు ఆవాల పొడిన పులిపిర్లు ఉన్న ప్రాంతంలో ముద్దగా ఉంచాలి ఇలా రోజు క్రమం తప్పకుండా నెల పాటు చేస్తే తప్పకుండా పులిపిర్ల లో వచ్చే మార్పుని మీరు గమనించవచ్చు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: