సహజ అందం కావాలని చాలా మంది ఆరాట పడుతూ ఉంటారు. కానీ సహజసిద్దమైన పద్దతులని పాటించడంలో మాత్రం మొఖం చాటేస్తారు. ఎందుకంటే అందుకు శ్రమతో కూడిన సహనం కావాలి కాబట్టి. ఈ పరుగుల  ప్రపంచంలో అంత తీరిక ఎవరికీ ఉండటం లేదు కాబట్టి. కానీ పూర్వం ఇలాంటి ఫేస్ క్రీములు ఏమి లేవు కానీ ముఖం మందారం లా , పాల మీగడలా మెరిసిపోతూ ఎంతో ఆకర్షణీయంగా ఉండేది. అందుకు గల కారణం సహజసిద్ద పద్దతులే. మీరు రోజు వారి వాడే క్రీములు పక్కన పట్టి ఈ పద్దతిని ఒక్క సారి ప్రయత్నించి చూడండి

 

ముందుగా స్వచ్చమైన గేదె పాలు తీసుకోవాలి. ప్యాకెట్ పాలని ఏ మాత్రం ఇందులో వాడకూడదు. ఈ పాలని కాచి చల్లార్చి గోరు వెచ్చగా ఉన్న సమయంలో ముఖాన్ని శుబ్రంగా కడుక్కుని ఆ పాలల్లో దూదిని ముంచి ముఖంపై బాగా రుద్దాలి. ఆ తరువాత తేనే రోజ్ వాటర్ తీసుకుని ముఖానికి పట్టించి మర్దనా చేయాలి. ఆ తరువాత కొంత సమయం ఉంచి. అలోవేరా జెల్ తీసుకుని బాగా మర్దనా చేయాలి.

 

ఇలా మర్దనా చేస్తున్న సమయంలోనే ముఖంపై నునుపుదనం కనిపిస్తుంది. అంతేకాదు ఈ క్రీముని బాగా ఆరనిచ్చి అలాగే ఉంచేసుకోవచ్చు. కానీ బయటకి వెళ్ళే సమయంలో మాత్రం వీటిని వాడకూడదు ఎందుకంటే ఎండ వేడిమికి ఇవి జిడ్డులా జారిపోతాయి. ఇంట్లో ఉన్న సమయంలో వీటిని రాసుకుని బాగా ఆరిన తరువాత చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు నెల పాటు చేస్తే తప్పకుండా మీ ముఖాన్ని మెరిసేలా చేయవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: