సాధార‌ణంగా చాలా మంది అబ్బాయిలు.. అమ్మాయిల కళ్ళ‌ను ఇష్ట‌ప‌డుతుంటారు. ఈ క్ర‌మంలోనే మగవాళ్ళు ఆడవారి అందం గురించి చెప్పేడప్పుడు కళ్ళ గురించే ఎక్కువ ప్రస్తావిస్తారు. అందుకే అమ్మాయిల కళ్ళ మీద కోట్ల కొద్దీ కవితలు ఉన్నాయి. అయితే ఎంత చిన్న కళ్ళైనా రవ్వంత కాటుకతో అలంకరిస్తే ఎంతో పెద్దవిగా, అందంగా కనిపిస్తాయి. కళ్లు ఏ ఆకారంలో ఉన్నా కాటుక పెట్టగానే ఆకర్షణీయంగా కనబడతాయి. కాటుక ఎండ, దుమ్ము, ధూళి ప్రభావాల నుంచి కంటిని కాపాడటమే గాక కళ్లను తాజాగా, మెరిసేలా చేస్తుంది. 


స్త్రీలకు అయిదవ తనాన్ని సూచించే సుమంగళ ద్రవ్యాలలో కాటుక ఒకటి. ఇది కళ్ళకు పెట్టుకోవడం ద్వారా కంటిలోని ఎర్రటి చారలు తొలగిపోతాయి. కళ్ళు పలికే భావాలు పెదవులు కూడా పలకలేవంటారు. అంటే కంటి బాసలకి అంత పవర్ ఉంది. కాటుక పెట్టుకోవడం వల్ల కళ్ళు పలికే భావాలు మరింత అందంగా ఉంటాయి. అయితే కాటుక పెట్టుకొనే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని కళ్లపై తడిలేకుండా తుడుచుకోవాలి.


ఎక్కువగా చెమట పెట్టే చర్మంగలవారు, ఉక్కపోతగా ఉన్నప్పుడు కాటుక పెట్టుకునేవారు ముఖాన్ని ఐస్‌ ముక్కలతో మర్దన చేసుకోవాలి. దీనివల్ల చెమట పట్టడం తగ్గి తద్వారా పెట్టిన కాటుక చెదరకుండా ఉంటుంది. కాటుక పెట్టుకునే ముందు మెత్తని వస్త్రంతో కనురెప్పను తుడుచుకోవాలి. దీనివల్ల కనురెప్పలపై ఉండే జిడ్డు పూర్తిగా తొలగిపోతుంది. లేదా కొద్దిగా పౌడర్‌ కళ్ల చుట్టూ రాస్తే చర్మంపై ఉండే జిడ్డుని పౌడర్‌ పీల్చుకొని కళ్లు తాజాగా ఉంటాయి. అలాగే క‌ళ్ళ‌కు ఎప్పుడు కూడా నాణ్యమైన కాటుక వాడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: