దాల్చిన చెక్క భారతీయ వంటకాలలో ఉపయోగించే సుగంధ ద్రవ్యము.  బిరియాని తయారీలోనూ, మషాలా కూరలు తయారీలోనేగా దీని ప్రభావం ఉంటుందనేది అంద‌రి అభిప్రాయం. కాని అయితే మనకు తెలియని మరో విషయం ఏమిటంటే ఈ దాల్చిన చెక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతే కాక సౌందర్యాన్ని కూడా పెంపొందింపజేస్తుంది. దాల్చిన చెక్క వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు వున్నాయి. దాల్చిన చెక్క మనకు జీవితాంతం మేలు చేస్తూనే ఉంటుంది. 


ఇందులో ఉండే ప్రోటీన్, ఫైబర్, క్యాల్షియం, రిబోఫ్లెవిన్, ఫాస్ఫరస్, ఐరన్, సోడియం, పొటాషియం, విటమిన్ సి, ఎ..మొదలైనవన్నీ సౌందర్యపరంగా చక్కని ప్రయోజనాలను అందిస్తాయి.


- మూడు టేబుల్ స్పూన్ల తేనెలో ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి ముఖానికి పట్టించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మొటిమలను సమర్ధవంతంగా తగ్గిస్తుంది. దీనిలోని యాంటీబాక్టీరియల్ గుణాలు మొటిమలను కలిగించే బాక్టీరియా ను తగ్గిస్తాయి.


- దాల్చిన చెక్కను పొడిచేసి, గంధం, రోజ్‌వాటర్‌తో కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం ముడతలు, రంగు తగ్గడం లాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.


- ముందు పెదవులపై వేజలీన్ పెట్రోలియం జెల్లీ రాసి.. దానిపై దాల్చిన చెక్క పొడిని అద్దండి. కొద్దిగా జిల జిలమంటుంది. తర్వాత మళ్ళీ కొద్దిగా వేజలైన్ రాస్తే.. నిండైన గులాబీ పెదవులు పొందొచ్చు.


- పొడి చర్మంతో బాధపడే వారు దాల్చిన చెక్క పొడికి రాళ్ల ఉప్పు, బాదంనూనె, ఆలివ్ ఆియల్, తేనె జత చేసి మొత్తని మిశ్రమంలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా అప్లై చేసుకుంటే చర్మం పొడిబారడం అనే సమస్య నుంచి బయటపడవచ్చు.


- దాల్చిన చెక్కకు కొద్దిగా పెసరపిండి జత చేసి తలకు మాస్క్ లేదా వాటర్ లో కలిపి క్లెన్సర్ గా కూడా ఉపయోగించవచ్చు. ఇది తలలో మురికి మరియు చుండ్రును ప్రభావంతంగా తొలగిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: