అందంగా క‌నిపించాల‌ని అంద‌రూ అనుకుంటారు. అందుకు భారీగా ఖ‌ర్చు చేసి ప్ర‌య‌త్నాలు చేస్తారు. కొంద‌రు అనేక ర‌కాల ప్ర‌యోగాలు చేస్తారు. అలాంటి ప్రయోగాల్లో పువ్వులు కూడా ఒకటి.  మల్లె, చేమంతి, జాజి ఇలా ఎన్ని రకాల పూలున్నా అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడేది గులాబీలనే. చాలమంది రోజ్ వాటర్‌ని ఉపయోగిస్తుంటారు. రోజ్ వాటర్ ను అందాన్ని మెరుగుపరుచుకోవడానికి, చర్మ సుభ్ర పరుచుకోవడానికి అనేక రకాల ఫేస్ ప్యాక్ లలో ఉపయోగిస్తారు. 


గులాబీ వాటర్ లాగే కొన్ని రకముల పువ్వులు కూడా చర్మంలో అద్భుత మార్పులు తీసుకురాగలవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గులాబీ తో పాటు మందారం, బంతిపువ్వు, తామరపువ్వు, మల్లేపూలతో ఫేస్ ప్యాక్ చేసుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.


- గులాబీ, తేనె, పెరుగు మిక్స్ చేయాలి. ఈ మిశ్ర‌మాన్ని ఫేస్‌కు అప్లై చేసి 20 నిమిషాల త‌ర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం నిగారింపుగా మారుతుంది.


- బంతిపూల రేకులను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి.. పెరుగు, గంధం పొడి వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. దీన్ని ముఖానికి అప్లే చేసి కొంత స‌మ‌యం త‌ర్వాత వాష్ చేసుకోవాలి.


- తామరపువ్వు రేకులు పేస్ట్ చేసి అందులో పచ్చిపాలు, కొన్ని చుక్కల బాదం ఆయిల్ మిక్స్ చేసి ఫేస్‌కు అప్లై చేయాలి. ఇలా వారానికి ఒక రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.


- మల్లెపువ్వుల రేకులు పేస్ట్ చేసి.. అందులో తేనె వేసి క‌లుపుకోవాలి. దీన్ని ముఖానికి అప్లే చేయాలి. ఇది సెన్సిటివ్ స్కిన్ కు గ్రేట్ గా సహాయపడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: