సాధార‌ణంగా చాలా మంది పొడి చ‌ర్మంతో బాధ‌ప‌డుతుంటారు. ఈ సమస్య సాధారణంగా వింటర్ లో ఎక్కువగా ఉంటుంది. వ‌య‌స్సుతో సంబంధం లేకుండా ఈ సమస్యను ఎదుర్కొంటారు. ఎందుకంటే చర్మంలో నూనె లేకపోవడం. వృద్ధుల్లో ఈ సమస్య తీవ్రత అధికం.  ప్రధానంగా వాతావరణంలో చలి ఎక్కువ అవుతున్నకొద్దీ ఈ సమస్య అధికమవుతుంది. పొడి చర్మం వల్ల చర్మంపై పొక్కులు, చర్మ పగుళ్లు ఏర్పడతాయి. దీనివల్ల బాధపడకుండా వివిధ రకాల ఫేస్‌ మాస్కులు ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. అయితే ఇలాంటి ఇంట్లోనే సులువుగా ఈ స‌మ‌స్య‌ను త‌గ్గించుకోవ‌చ్చు.. అది ఎలాగో ఓ లుక్కేసేయండి..


- . ఒక టీస్పూన్ వెన్న‌కు చిటికెడు ప‌సుపు క‌లిపి ముఖానికి రాసి అర‌గంట త‌రువాత క‌డిగేయాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే పొడి చ‌ర్మం నుంచి ర‌క్షించుకోవ‌చ్చు.


- స్ట్రాబెర్రీలను మెత్తగా చేసి, అందులో తేనె, పెరుగు, లెమన్‌ జ్యూస్‌ మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కొంత స‌మ‌యం  తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్‌ చేసుకోవాలి.


- తాజాగా ఉన్న పెరుగు తీసుకొని, ముఖం, చేతులు మరియు కాళ్ళకు అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత‌ స్నానం చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.


- వెన్న‌లో, ఉడికించిన క్యారెట్ గుజ్జును క‌లిపి ముఖానికి రాసి అర‌గంట అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీంతో చ‌ర్మం మృదుత్వాన్ని సంత‌రించుకుంటుంది.


- తొక్క తీసిన కీరదోసకాయను మెత్తగా పేస్ట్‌ చేసి, అందులో పెరుగు కలపి.. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల‌ తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి


మరింత సమాచారం తెలుసుకోండి: