కరివేపాకే కదా అని తీసిపారేయకండి ఇప్పుడు ఇదే మీ ఆరోగ్యాన్ని అందాన్ని మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కరివేపాకు చాలా మంది దూరం పెడుతారు. అన్నం తింటున్న సమయంలో కూరలో వచ్చిన కరివేపాకు మొత్తం ఏరి పక్కన పెట్టి మరీ భోజనం కానిస్తారు.కానీ అసలు కరివేపాకు ఎందుకు వేస్తారు అనేది మాత్రం ఆలోచన చేయరు.పోనీ అదేమన్న మంచి సువాసన వచ్చేదా కూరల్లో వేయడానికి..?? మరి ఏమిటి దాని ప్రయోజనం అనే ఆలోచన ఎప్పుడైనా చేశారా ..?? సరే ఇప్పుడు ఈ విషయం తెలుసుకుందాం.

 

 

అందం ,ఆరోగ్యం రెండిటికి కర్వేపాకు అద్భుతంగా పనిచేస్తుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారికి కరివేపాకు ఓ దివ్యమైన ఔషధమనే చెప్పాలి. ఎందుకంటే కరివేపాకు బ్లడ్ లో షుగర్ లెవిల్స్ తగ్గిస్తుంది. దాంతో షుగర్ కంట్రోల్ అవుతుంది. అధిక కొవ్వు తగ్గించడంలో కూడా కరివేపాకు ఎంతో దోహద పడుతుంది. బరువు తగ్గాలని అనుకునే వారు తప్పకుండా కరివేపాకుని నిత్యం తీసుకోవడం ఎంతో ఉత్తమం.

 

మూత్ర నాళాలని శుభ్రం చేయడానికి , కిడ్నీ లో రాళ్ళు ఏర్పడకుండా ఉండటానికి కరివేపాకు కీలక పాత్ర పోషిస్తుంది. అన్నం జీర్ణం అవ్వకుండా బాధపడే వారు పచ్చి కరివేపాకు తినడం వలన ఎంతో ఉపయోగం ఉంటుంది. జుట్టు ఊడిపోతూ అండ విహీనంగా కనిపించే వారు ప్రతీ రోజు కరివేపాకు మీ మెనూ లో చేర్చుకోవడం వలన జుట్టు రాలు సమస్య తగ్గుముఖం పడుతుంది. అంతేకాదు ముఖంపై మచ్చలు, మొటిమలు సైతం కరివేపాకు రోజూ రీసుకునే వారి దరిచేరవు.  


మరింత సమాచారం తెలుసుకోండి: