వాతావరణం హాట్ హాట్‌గా ఉన్నప్పుడు ఒక చ‌ల్ల‌ని బీర్ కొడితే.. ఆ మ‌జాయే వేరు అని చాలా మంది అనుకునే ఉంటారు. మందుబాబులు అయితే బీర్ తాగి మత్తులో మునిగి తేలుతారు. ఒకప్పుడు మందు తాగాలంటే అది చాలా పెద్ద తప్పుగా భావించేవారు. కానీ.. బీర్ తాగడం అనేది ఇప్పుడు చాలా మాములు విషయం అయిపోయింది. ఏదేమైన‌ప్ప‌టికీ మ‌ద్యం తాగ‌డం ఆరోగ్యానికి హానికరం. కానీ దాన్నెలా వాడాలో అలా వాడితే మంచి ఫలితం ఉంటుందట. ఉదాహరణకు బీర్‌ను కొన్ని మిశ్రమాలతో కలిపి వాడితే అందాన్ని.. వ‌స్తువుల‌ను మరింత మెరిపించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..


- కోడిగుడ్డులోని తెల్లపదార్థానికి బీరుతో పాటు బాదం నూనె కల‌పాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అప్లే చేసి డ్రై అయిన‌ తర్వాత వాష్ చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.


- స‌హ‌జంగా వంట పాత్రల్లో పేరుకుపోయే జిడ్డును తొలగించడంలోనూ బీర్ గ్రేట్‌గా ప‌ని చేస్తుంది. బీర్‌లో స్క్రబర్‌ను ముంచి పాత్రలను రుద్దితే చాలు దాంతో జిడ్డు వదిలిపోతుంది.


- బీర్‌ మంచి కండిషనర్‌గా ప‌ని చేస్తుంది. బీర్‌తో జుట్టుని కడిగి కొన్ని నిమిషాల తరువాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మెరుస్తుంటుంది. 


- బీర్‌లో విట‌మిన్ బి, ఈస్ట్ వంటివి పుష్క‌లంగా ఉంటాయి. దీని వల్ల బీర్ వెంట్రుక‌ల‌కు ఆరోగ్యాన్నిస్తుంది. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెర‌గ‌డంలో బీర్ బాగా ఉపయోగ‌ప‌డుతుంది.


- స్ట్రాబెర్రీని పేస్ట్ చేసి అందులో బీర్‌ను కలుపాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్‌కు ప్యాక్‌లా వేసుకొని కొంత స‌మ‌యం త‌ర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై మ‌చ్చ‌లు తొల‌గి గ్లోగా మారుతుంది.


- బీర్‌లో ఒక స్పాంజ్‌ను ముంచి దాంతో దుస్తులపై పడిన మరకలను లేదా తుప్పు మరకలు తుడిచి క్లీన్ చేస్తే ఆ మరకలు సులువుగా మాయం అవుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: