శరీర సౌష్టం కోసమని జిమ్ లు, ఫిట్ నెస్ సెంటర్లు చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సుందరమైన శరీర సౌష్టం పొందడానికి, ఆకర్షణీయంగా కనబడటానికి వేలకు వేలు డబ్బు ఖర్చు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఫలితం కనిపించినా, తర్వాత తర్వాత తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటారు. దాంతో ఒక్కోక్కో సారి విసిగు చెంది, అసలు డైయట్ చేయడమే మానేస్తారు. కాబట్టి కృత్రిమంగా కాకుండా సహజంగా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తే తప్పకుండా శాశ్వత పరిష్కారం ఉంటుంది. దాంతో అధిక బరువును తగ్గించుకోవడం ద్వారా సౌందర్యం మాత్రమే కాదు, ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారు.

అధిక బరువు పెరిగితే ఒబేసిటి, కొలెస్ట్రాల్, అధిక బ్లడ్ ప్రెజర్ వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. బరువు తగ్గాలనుకొనే వారు కడుపు మాడ్చుకోవలసిన అవసరం లేదు.కడుపు మాడ్చుకొని ఉపవాసలు చేయాల్సిన పనిలేదు. చిన్న చిన్న నీటి బిందువులే మహా సముద్రం అయినట్లు మనం తీసుకునే కొద్దిపాటి జాగ్రత్తలే ఆరోగ్యాన్ని కాపాడతాయి. సాయంత్రం పిజ్జా, బర్గర్ లు లాగించేసి రాత్రి కేవలం పెరుగన్నం తినేస్తే సరిపోతుంది అన్నది పొరపాటు. పిజ్జా బర్గర్ లతో పాటు పెరుగులో ఉండే వెన్న కూడా శరీరంలోకి చేరి కొవ్వును మరింత పెంచేస్తుంది. డైట్ కంట్రోల్ లో వున్నవారు మీగడను తీసేసిన పాలు, మజ్జిగను మాత్రమే వాడాలి. ఈ ప్రాథమిక సూత్రాన్ని పాటించకపోతే ఎన్ని జాగ్రత్తలు పాటించినా వ్యర్థమే.కాబట్టి


 అధిక బరువును తగ్గించుకోవడానికి మీకు సహాయపడే కొన్ని చిట్కాలు మీకోసం... 

వైట్ రైస్:  చాలా తక్కువ న్యూట్రీషియన్స్ మరియు హై క్యాలరీ కౌంట్, కలిగి ఉండటం వల్ల మీరు అన్నంను తీసుకోవడానికి తప్పనిసరిగా దూరంగా ఉండాలి. అంతే కాదు, వైట్ రైస్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ఎక్కువగా పెరిగేలా చేస్తుంది. అందువల్ల, వైట్ రైస్ కు బదులు, బ్రౌన్ రైస్ ను ఎంపిక చేసుకొని ఆరోగ్యంగా  ఉంటారు.

ద్రాక్ష:  సాధారణంగా పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తుంటారు. అయితే, ద్రాక్షలో అధిక షుగర్ కంటెంట్ ఉంటుంది. అందువల్ల మీ రెగ్యులర్ డైట్ లిస్ట్ నుండి ద్రాక్షను తొలగించండి. బరువు తగ్గించుకోవాలనుకొనేవారు, ద్రాక్షకు దూరంగా ఉండటం మంచిది. 

 నీరు ప్రధానం : నీరు ఎక్కువ తాగడం వలన ఆకలి త్వరగా వేయదు. నీరు ఎక్కువగా తాగడం వల్ల ఎక్కువ తినాలన్న కోరిక కలగదు. తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకొంటారు. నాన్ స్టిక్ పాత్రలలో వంట చేయడం వల్ల నూనె తక్కువ పట్టడంతో పాటు పదార్థాలలో పోషకవిలువలు పోకుండా ఉంటాయి. అప్పడాలను వేయించుకునే బదులు కాల్చుకొని తింటే వాటిని తినాలన్న కోరిక తీరుతుంది. నూనెనుండి తప్పించుకున్నట్లు ఉంటుంది.

స్టాట్యుటరీ ఫాట్ ను తగ్గించాలి: నూనె, నెయ్యిలలో స్టాట్యూటరీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. వంటకాలలో వీటిని సాధ్యమైనంత తక్కువ ఉపయోగిస్తూనే మరికొన్నింటిలో పూర్తిగా మానేయొచ్చు. చపాతీలలోనూనె కన్నా పుల్కాలు ఆరోగ్యకరం. దోశ, వడ కన్నా ఆవిరి మీద తయారు చేసిన ఇడ్లీమేలు. రోజూవారీ భోజనంలో ఉపయోగించే నెయ్యిని కూడా పూర్తిగా నిషేధించాల్సిందే.

సోడా:  డైట్ సోడాలో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ను ఉపయోగించడం వల్ల బరువు తగ్గడానికి బదులు అతి తేలికగా బరువు పెరిగేలా చేస్తాయి. అందువల్ల, మీ మెను నుండి డైట్ సోడాను పూర్తిగా నివారించండి. 

క్యాన్డ్ ఫుడ్స్:  డబ్బాల్లో నిల్వ చేసిన ఆహారాలు మనం చూడగానే మనల్ని ఆకర్షిస్తుంటారు. మనం ఆకలిగా ఉన్నప్పుడు వాటిని వెంటనే తినేయాలని టెప్ట్ చేసేస్తాయి. అయితే డబ్బాల్లో, బాటిల్స్ లో నిల్వ చేసిన ఆహారాల్లో అధికంగా సోడియం (ఉప్పు) చేర్చబడి ఉంటుంది. డైటింగ్ చేసేవారికి ఇది చాలా చెడు ప్రభావాన్ని తలపెడుతుంది. 

మాంసాహారం: మాంసాహారం తప్ప మరేమి తినని వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారి కోసం ఈ చిట్కా. మాంసాహారం వండేటప్పుడు చర్మం తీసేసి వండాలి. దీని వలన వందక్యాలరీలు తగ్గిపోతాయి. దీని తయారీలో నూనెకు బదులు నీటిని వాడితే కొవ్వు చేరకుండా జాగ్రత్తపడవచ్చు. చేపలలో తక్కువ పరిమాణంలో కొవ్వు ఉంటుంది. చికెన్, మటన్ కి బదులుగా చేపలు తినడం అలవాటు చేసుకుంటే మంచిది.

కాల్షియం చాలా అవసరం: బరువు తగ్గడంలో కాల్షియం ముఖ్యం పాత్ర వహిస్తుంది అని మనకు తెలిసిన మనం దానిని పట్టించుకోకుండా ఉంటాము కాని ఆహారంలో కాల్షియం తప్పనిసరిగా వుండేటట్లు చూసుకోవాలి. కొవ్వు తక్కువగా ఉన్న పెరుగు, పనీర్ చాలా బాగా పనిచేస్తాయి. పాలలో వుండే మీగడలో క్యాలరీలు అధికంగా వుంటాయి. పాలను నేరుగా తీసుకోవడం కన్నీ మజ్జిగ రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: