దేశంలో ఆన్ లైన్ మార్కెటింగ్ రాజ్యమేలుతున్న సంగతి తెలిసిందే. పిజ్జాలు , బిర్యానీలతో సహా దాదాపుగా అన్ని వస్తువులు డోర్ డెలివరీ అవుతున్నాయి. ఈ విషయంలో నిన్న మొన్నటి వరకు ఆటో మోబైల్ రంగం అడుగుపెట్టిన దాఖలాలు లేవు. తాజాగాహీరో మోటోకార్ప్‌  తొలిసారిగా ఆన్ లైన్ వైపు అడుగేసింది. ఈ కామర్స్ వ్యవస్ధ పెరిగిన తర్వాత ప్రతి వస్తువు ఇంటి వద్దకే డోర్ డెలివరీ అవుతోంది. పెద్ద పెద్ద నగరాల్లో డిపార్ట్ మెంట్ స్టోర్స్, మెడికల్ షాపులు కూడా డోర్ డెలివరీ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఇప్పుడు ఇదే బాటలో నడిచేందుకు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ కూడా ప్రణాళికలు రూపోందిస్తోంది. హీరో బైక్స్ కొనుగోలు చేసే వారికి సంస్ధ వాటిని హోం డెలివరీ చేయనుంది. ఇందుకోసం కస్టమర్ రూ.349 చెల్లిస్తే చాలు. 

ఇప్పటికే ముంబై, బెంగళూరు, నొయిడాలో ఈ సేవలను ఆరంభించిన సంస్ధ త్వరలో దేశంలోని 25 నగరాలకు ఈ సేవలను విస్తరించాలనుకుంటోంది. వినియోగదారులు అద్భుతమైన అనుభూతిని ఆస్వాదించేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని పరిశీలిస్తున్నాం. ఇందుకోసం వినూత్న కార్యక్రమాలు తీర్చిదిద్దుతున్నాం.తాజా నిర్ణయంతో ద్విచక్ర వాహనాల కేటగిరీలో వినియోగదారులు మరింత సౌకర్యంగా ఉంటారని ఆశిస్తున్నాం... కస్టమర్లకు మెరుగైన అనుభవానిచ్చే వ్యాపార నమూనాల కోసం  పెట్టుబడులు పెడుతూనే ఉన్నాం" అని హీరో మోటోకార్ప్‌ సేల్స్‌ విభాగం హెడ్ సంజయ్‌ భాన్ తెలిపారు.

దేశంలో విక్రయించే ప్రతి 2 బైక్ లలో ఒకటి హీరో వెహికల్ ఉంటోందని ఆయన వివరించారు. తాము కొనుగోలు చేసే ప్రతి వస్తువుపైనా అదనపు సేవలు అందాలని యువత భావిస్తోందన్నారు. అందు కోసం ఇలాంటి సేవలను ప్రవేశ పెట్టినట్లు ఆయన తెలిపారు. మోటర్‌ సైకిల్‌, స్కూటర్లను మొదటగా ఇ-కామర్స్‌ వేదికకు తీసుకొచ్చాం, వినియోగదారుల చిరునామాకే కాకుండా వారు కోరిక మేరకు ఎక్కడికైనా డెలివరీ చేస్తాం అని సంజయ్‌ ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: