ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కు చెందిన ఎలక్ట్రిక్ స్కూట‌ర్ల‌ విభాగం హీరో ఎలక్ట్రిక్ విపణిలోకి రెండు సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ల‌ను ప్రవేశపెట్టింది. అధునాతన ఆప్టిమా ఈఆర్, నిక్స్ ఈఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల‌ను విడుదల చేసింది. హీరో ఎలక్ట్రిక్ సంస్థ‌ ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న సాధారణ ఆప్టిమా ఇ5, నిక్స్ ఇ5 మోడళ్లను కొనసాగిస్తూనే.. ఈ మోడల్స్‌ను అదనంగా ప్రవేశపెట్టింది. ఈ రెండూ కంపెనీ హైస్పీడ్ సిరీస్ స్కూటర్ల రేంజ్‌లో లభ్యమవుతాయి.


సాధారణ స్కూటర్‌ల‌లో ఉన్నటువంటి అవే ఎలక్ట్రిక్ మోటార్ వ్యవస్థలే ఈ రెండు మోడళ్లలో ఉన్నాయి. అయితే సింగిల్ బ్యాటరీ బదులుగా ఇందులో డ‌బుల్‌ బ్యాటరీ ప్యాక్‌లు అందించారు. వీటి ధర రూ. 68,000 గా నిర్ణయించారు. ఆప్టిమా ఈఆర్ స్కూటర్ల‌లో 48 వోల్ట్‌ సింగిల్ బ్యాటరీ ప్యాక్ అనుసంధానం గల 600వాట్స్ బిఎల్‌డిసి ఎలక్ట్రిక్ మోటార్ కలదు. ఈ కొత్త స్కూటర్లో అన్ని సాధారణ ఫీచర్లు లభిస్తున్నాయి. 4.5 గంట‌ల ఛార్జింగ్‌తో గ‌రిష్టంగా 100 కిలోమీటర్లు నడుస్తుంది. అలాగే దీని గరిష్ట వేగం గంటకు 40 కిలోమీటర్లుగా ఉంది.


ఇక హీరో నిక్స్ ఇఆర్ స్కూటర్ విషయానికి వస్తే.. ఇందులో కూడా అదే 48 వోల్ట్ బ్యాట‌రీ ప్యాక్‌, 600 వాట్ బీఎల్‌డిసి ఎల‌క్ట్రిక్ మోట‌ర్ సిస్ట‌మ్ ఉంది. పర్ఫామెన్స్, టాప్ స్పీడ్ మైలేజ్, గ‌రిష్ట వేగం అన్ని కూడా అచ్చం ఆప్టిమా ఈఆర్‌ స్కూటర్ మాదిరిగానే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న 615 విక్రయ కేంద్రాలను 2020 నాటికి వెయ్యి కేంద్రాలకు విస్తరించాలని భావిస్తోంది హీరో. డిజైన్, ధ‌ర‌, మైలేజ్‌తో పాటు పలు టెక్నికల్ ఫీచర్ల ఆధారంగా నచ్చిన మోడల్ ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: