టీవీఎస్‌ జూపిటర్‌ మోడల్‌ను అప్‌డేటెడ్‌ వెర్షన్‌తో ఇప్పుడు జూపిటర్‌ గ్రాండిగా మార్కెట్‌లోకి వచ్చింది. దీని ధర రూ. 59,990 (ఎక్స్‌-షోరూమ్‌ ఢిల్లీ)గా నిర్ణయించారు. జూపిటర్‌ రెగ్యులర్‌ వెర్షన్‌తో పోల్చుకుంటే జూపిటర్‌ గ్రాండి ధర 6,700 రూపాయలు ఎక్కువ. కొత్తగా పరిచయమైన ఫీచర్‌ విషయానికి వస్తే టీవీఎస్‌ ఎన్‌టార్క్‌ 125 స్కూటర్‌ నుంచి సేకరించిన 'స్మార్ట్‌ఎక్స్‌ కనెక్ట్‌' అనే స్మార్ట్‌ ఫోన్‌ కనెక్టివిటీ ఫీచర్‌ తీసుకొచ్చారు. ఈ స్మార్ట్‌ఎక్స్‌ కనెక్ట్‌ ఫీచర్‌ రైడర్‌ వాడుతున్నటువంటి ఐఒఎస్‌ లేదా ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోనుకు కనెక్ట్‌ చేసుకోవచ్చు.


స్కూటర్‌కు సంభందించిన వివరాలన్నింటినీ రైడర్‌ తన స్మార్ట్‌ ఫోన్‌లో పొందవచ్చు. ఫోన్‌ కాల్‌ అలర్ట్స్‌, టెక్ట్స్‌ మెసేజ్‌, ఓవర్‌-స్పీడ్‌ వివరాలు, ట్రిప్‌ డిటైల్స్‌ వంటి ఎన్నో వివరాలు చూసుకునే వెసులుబాటు ఉంది. డ్యాష్‌ బోర్డు మీదున్న డిజిటల్‌-అనలాగ్‌ ఇంస్ట్రుమెంట్‌ క్లస్టర్‌లో కూడా ట్రిప్‌ మీటర్‌, ఓడో మీటర్‌ రీడింగ్స్‌, ట్యాంక్‌లో పెట్రోల్‌ లెవల్‌ వంటి ఇతర సమాచారాన్ని సూచించే పలురకాల లైట్లు డ్యాష్‌బోర్డులో ఉన్నాయి.


అదనంగా క్రోమ్‌తో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్స్‌, సెగ్మెంట్లోనే తొలిసారిగా డ్యూయల్‌-కలర్‌ త్రీడీ లోగో అందించారు. ఈ మోడల్‌ 'టెక్‌ బ్లూ' పెయింట్‌ స్కీమ్‌లో లభ్యమవుతోంది. అంతే కాదు, క్రోమ్‌ ఫినిషింగ్‌ గల బాడీ ప్యానల్స్‌, రియర్‌ వ్యూవ్‌ మిర్రర్స్‌, మెరూన్‌ కలర్‌ సీట్‌, డ్యూయల్‌ టోన్‌ అల్లారు వీల్స్‌ వంటివి ప్రత్యేకంగా నిలిచాయి.


ఇది కేవలం సింగల్‌ వేరియంట్లో మాత్రమే లభ్యమవుతోంది. ఇందులో ఫ్రంట్‌ వీల్‌కు డిస్క్‌ బ్రేక్‌ కూడా ఉంది. సాంకేతికంగా చూస్తే, 109.7సీసీ కెపాసిటీ గల సింగల్‌ సిలిండర్‌ ఇంజన్‌ కలదు అమర్చారు. ఇది 8బిహెచ్‌పి పవర్‌, 8.4ఎన్‌ఎమ్‌ టార్క్‌ ప్రొడ్యూస్‌ చేస్తుంది. సస్పెన్షన్‌ కోసం ముందు వైపున టెలిస్కోపిక్‌ ఫ్రంట్‌ ఫోర్క్స్‌, వెనుక ప్రి-లోడ్‌ అడ్జస్టబుల్‌ షాక్‌ అబ్జార్వర్లు ఉన్నాయి. స్టాండర్డ్‌, జడ్‌ఎక్స్‌, జడ్‌ఎక్స్‌ డిస్క్‌, క్లాసిక్‌ అనే నాలుగు అదనపు వేరియంట్లలో జూపిటర్‌ స్కూటర్ సెలెక్ట్ చేసుకోవ‌చ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: