ఫిబ్రవరి 4వ తేదీన చరిత్రలో ఎంతోమంది ప్రముఖులు జన్మించారు. మరి నేడు ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి చూసి... ఈరోజు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి...!

 

 మాడభూషి అనంతశయనం అయ్యంగారు జననం : స్వతంత్ర సమరయోధుడు పార్లమెంటు సభ్యులు లోక్ సభ స్పీకర్ అయిన మాడభూషి అనంతశయనం అయ్యగారు 1891 ఫిబ్రవరి 4వ తేదీన జన్మించారు. అటు స్వతంత్ర సమర యోధుడిగా కీలక పాత్ర పోషించిన మాడభూషి అనంతశయనం అయ్యంగారు ఇటు రాజకీయ నాయకుడిగా కూడా కీలక పాత్ర పోషించారు. 

 

 రాకేష్ శుక్ల జననం : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు అయిన రాఖీ శుక్ల 1948 ఫిబ్రవరి 4వ తేదీన జన్మించారు. ఈయన 121 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లు ఆడారు... భారత క్రికెట్ జట్టుకు 1982లో టెస్ట్ మ్యాచ్లో ప్రాతినిధ్యం కూడా వహించాడు. రాకేష్ శుక్లాకు హిట్టింగ్ బ్యాట్ మెన్ గా  ఎంతో పేరు ఉండేది. 

 

 హీరో రాజశేఖర్ జన్మదినం : తెలుగు చిత్ర పరిశ్రమకు రాజశేఖర్ నటుడిగా కొసమెరుపు. నాటి సినిమా ల నుండి నేటి సినిమా వరకు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. వందేమాతరం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రాజశేఖర్ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి సంచలన విజయాలను నమోదు చేశారు. తెలుగుతో పాటు తమిళ సినిమాలలో కూడా నటించారు రాజశేఖర్. రాజశేఖర్ నటుడే కాదు వైద్య వృత్తిలో నైపుణ్యుడు . ఆ తరువాత 1991లో తన సహనటి అయిన జీవితం వివాహం చేసుకున్నాడు రాజశేఖర్. ప్రస్తుతం జీవిత రాజశేఖర్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఇక అంకుశం సినిమాతో పోలీస్ పాత్రలో నటించిన హీరో రాజశేఖర్ ఎంతో క్రేజ్ సంపాదించారు. ఈ సినిమా ఎంతో మంది పోలీసులను కూడా ప్రభావితం చేసింది. రాజశేఖర్ అన్ని  సినిమాల్లో  సాయి కుమార్ డబ్బింగ్ చెప్పేవారు. 

 

ఇక ఇప్పుడు కూడా వరస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు రాజశేఖర్. మొన్నటికి మొన్న పిఎస్వి గరుడ వేగ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రాజశేఖర్...  గత సంవత్సరం కల్కి సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. హీరో రాజశేఖర్ 1962 ఫిబ్రవరి 4వ తేదీన జన్మించారు.

 

 

 శేఖర్ కమ్ముల జన్మదినం : ప్రముఖ తెలుగు దర్శకుడు అయిన శేఖర్ కమ్ముల తెలుగు ప్రేక్షకులందరికీ కొసమెరుపు. భిన్నమైన కథాంశంతో సినిమాలను తెరకెక్కించడంలో శేఖర్ కమ్ముల తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. 1972 ఫిబ్రవరి 4వ తేదీన జన్మించారు శేఖర్ కమ్ముల . ముఖ్యంగా శేఖర్ కమ్ముల నటించిన సినిమాల్లో ఆనంద్ గోదావరి హ్యాపీడేస్ లీడర్ ఫిదా సినిమా లకు ఆరు నంది పురస్కారాలు కూడా అందుకున్నాడు. కాగా శేఖర్ కమ్ముల మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్. ఈ సినిమాకు గాను ఉత్తమ నూతన దర్శకుడు కూడా జాతీయ పురస్కారం లభించింది శేఖర్ కమ్ములకు. శేఖర్ కమ్ముల సినిమాలు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఎలాంటి అశ్లీలత లేకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: