ఫిబ్రవరి 8వ తేదీన చరిత్రలో ఎంతోమంది ప్రముఖులు జన్మించారు. జన్మించిన ప్రముఖులు ఎవరు తెలుసుకుందాం రండి.

 

 జాకీర్ హుస్సేన్ జననం : స్వతంత్ర సమరయోధుడు మూడవ భారత రాష్ట్రపతి అయిన జాకీర్ హుస్సేన్ 1997 ఫిబ్రవరి 8వ తేదీన జన్మించారు. బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా స్వతంత్ర సంగ్రామంలో మహాత్మా గాంధీతో కలిసి పనిచేశాడు జాకీర్ హుస్సేన్. ఈయన  బీహార్ రాష్ట్రానికి గవర్నరుగా కూడా పనిచేసారు. 1952 నుంచి 1962 వరకు బీహార్ రాష్ట్రానికి గవర్నర్ గా సేవలు అందించిన తర్వాత... 1962 నుంచి 1967 వరకు భారత ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించాడు జాకిర్ హుస్సేన్ . ఆ తర్వాత 1967 మే 13న భారత రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. కాగా ఈయన  రాష్ట్రపతిగా కొనసాగుతున్న సమయంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండగా ఉప రాష్ట్రపతిగా వి.వి.గిరి ఉన్నారూ .ఈయన కంటే ముందు రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉన్నారు. 

 

 

 ఆండ్ర శేషగిరిరావు జననం : సుప్రసిద్ధ కవి నాటక కర్త మరియు పత్రికా సంపాదకుడు అయిన ఆండ్రా శేషగిరి రావు  1902 ఫిబ్రవరి 8వ తేదీన జన్మించారు. ఈయన  ఎన్నో నాటకాలను కూడా రచించారు. సాయిబాబా,  త్యాగరాజు,  భారతీ పుత్రి,  వదిన లాంటి నాటకాలు రచించిన ఈయన  ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు, 1965 సంవత్సరం లో ఆయన మరణించారు. 

 

 

 పొత్తూరి వెంకటేశ్వర రావు జననం  : తెలుగు పత్రికా రంగ ప్రముఖుడైన పొత్తూరి వెంకటేశ్వరరావు 1934 ఫిబ్రవరి 8వ తేదీన జన్మించారు, ఐదు దశాబ్దాల పాటు పత్రికా రంగంలో పనిచేసి ఎంతో అనుభవం సంపాదించారు. పత్రిక సంపాదకునిగా..  ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ అధ్యక్షుడిగా పలు హోదాల్లో పనిచేశారు పొత్తూరు వెంకటేశ్వరరావు. ముఖ్యంగా ఆంధ్రప్రభ వార్తాపత్రికలో సంపాదకులుగా చాలా కాలం పనిచేశారు. 

 

 

 జగ్జీత్సింగ్ జననం : ప్రఖ్యాతి గాంచిన భారతీయ గజల్ గాయకుడైన   జగ్జీత్సింగ్ 1941 ఫిబ్రవరి 8వ తేదీన జన్మించారు. ఈయన హిందీ ఉర్దూ పంజాబీ బెంగాలీ గుజరాతి మరియు నేపాలి భాషలలో పాడగలడు. ఈయన  ఎన్నో పాటలను వివిధ భాషల్లో పాడారు . 2011 సంవత్సరంలో ఈయన  పరమపదించారు. 

 

 

 మహమ్మద్ అజారుద్దీన్ జననం : భారత మాజీ కెప్టెన్ అయిన మహమ్మద్ అజారుద్దీన్ 1963 ఫిబ్రవరి 8వ తేదీన జన్మించారు. క్రికెట్  ఆటలో  లో ఎంతగానో రాణించి భారతదేశానికి ఎన్నో విజయాలను అందించారు. కొంత కాలం పాటు కెప్టెన్ గా  కూడా వ్యవహరించాడు మహమ్మద్ అజారుద్దీన్. హాజారుద్దిన్ కెరియర్  సాఫీగా సాగిపోతున్న సమయంలో మహమ్మద్ అజారుద్దీన్ పై  మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి.ఇక  మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న మొహమ్మద్ అజారుద్దీన్  తన క్రికెట్ కెరీర్ ని పోగొట్టుకున్నాడు. ఈయన  కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ  సభ్యునిగా ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. కాగా ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మహమ్మద్ అజారుద్దీన్ కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: