మార్చి 2వ తేదీన ఒకసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జన్మించారు. మరి ఈరోజు ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి ఎవరు జన్మించారో  తెలుసుకుందాం రండి. 

 

 

 దుద్దిళ్ళ శ్రీపాదరావు జననం: ప్రముఖ రాజకీయ నాయకుడు శాసనసభ్యులు శాసనసభ స్పీకర్గా పదవులను అలంకరించిన వ్యక్తి దుద్దిళ్ళ శ్రీపాదరావు 1935 మార్చి 2వ తేదీన జన్మించారు. 1935 మార్చి 2వ తేదీన కాటారం మండలం ధన్వాడ గ్రామానికి చెందిన రాధాకృష్ణయ్య కమలాబాయి దంపతులకు జన్మించాడు దుద్దిళ్ళ శ్రీపాదరావు. మొదట స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామ సర్పంచిగా పోటీ చేయాలని దుద్దిళ్ళ శ్రీపాదరావు ఒత్తిడి చేశారు. నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్న శ్రీపాద రావు రాజకీయాల్లో అడుగుపెట్టాలని స్నేహితులు ప్రోత్సహించడంతో రాజకీయాల్లోకి వచ్చారు. మొదటి సారి సర్పంచ్ గా ఎన్నుకోబడ్డ ఆయన రెండోసారి కూడా ప్రజలు ఆయన గెలిపించారు.ఇక రాజకీయాలు అంతకంతకూ ఎదుగుతూ వచ్చి,.. 1984 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారూ. ఇలా రాజకీయాల్లో పలు పదవులు అలంకరించి తన ప్రస్థానాన్ని కొనసాగించారు దుద్దిళ్ళ శ్రీపాదరావు. 

 

 యాకూబ్ జననం : తెలుగు కవిత్వంలో బహుత్ కూబ్  యాకుబ్ అని చేకూరి రామారావు గారి ఆంధ్రజ్యోతి పత్రిక రాతల్లో  కొనియాడబడిన కవి యాకూబ్. కేంద్ర సాహిత్య అకాడెమీ తెలుగు సలహా దారుగా నియమించబడ్డాడు ఈయన. అయితే యాకుబ్  1962 మార్చి 2వ తేదీన జన్మించారు. ఖమ్మం జిల్లాలో ఈయన జన్మించారు. ప్రస్తుతం హైదరాబాదులోని చైతన్యపురి లో సొంత ఇంటిలో నివసిస్తున్నారు. అయినా అంతర్జాలం ద్వారా బహుళ ప్రాచుర్యం పొందుతున్న తెలుగు కవిత  సంఘమును ప్రారంభించి నిర్వహిస్తున్నారు. 

 

 ఆండ్రూస్ స్ట్రాస్  జననం : ఇంగ్లీష్ స్టార్ క్రికెటర్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు నాయకుడు అయిన ఆండ్రూ స్ట్రాస్ 1977 మార్చి 2వ తేదీన జన్మించారు. ఎడమ చేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయిన అండ్రు   స్ట్రాస్  ఇంగ్లాండ్ జట్టులో  ఎన్నో కీలక మ్యాచ్ల్లో జట్టును విజయతీరాలకు నడిపించారు. తనదైన బాటిల్తో అద్భుత ప్రదర్శన చేస్తూ ఎన్నో మ్యాచ్ లలో... చెలరేగి ఆడి రికార్డులు  సైతం సృష్టించాడు. ఇక ఎన్నో మ్యాచ్ల్లో జట్టును ముందుండి నడిపించి... అద్భుత ప్రదర్శన చేశాడు... ఆండ్రూస్ స్ట్రాస్. ఇక ఎన్నో రికార్డులను సైతం తిరగరాశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: