మార్చి 8వ తేదీన ఒక సారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జన్మించారు. మరొక్కసారి ఈరోజు చరిత్రలో కి వెళ్లి చూసి జన్మించిన ప్రముఖులు ఎవరు తెలుసుకుందాం రండి.. 

 

 నార్ల తాతారావు జనం : ప్రఖ్యాత భారత విద్యుత్తు రంగ నిపుణుడు పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు మాజీ చైర్మన్ నార్ల తాతారావు 1917 మార్చి 8వ తేదీన జన్మించారు. ఈయన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి 1941లో ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఈయన మొదట టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలో ఉద్యోగిగా చేరి ఇన్ని రోజుల పాటు  పనిచేశారు. ఇక ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ డివిజనల్ ఇంజనీర్ గా ఉద్యోగ జీవితాన్ని మొదలు పెట్టారు నార్ల తాతారావు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ విద్యుత్ బోర్డు లో పనిచేసిన కాలంలో... ఆ విద్యుత్ సంస్థను దేశంలోనే అగ్రగామిగా నిలిపారు  నార్ల తాతారావు.

 

 

థర్మల్ విద్యుత్ కేంద్రాల డిజైన్లను మార్చడం ద్వారా విద్యుత్  రంగంలో పెద్ద విప్లవమే తీసుకొచ్చాడు నార్ల తాతారావు. ఆ తర్వాత నార్ల తాతారావు తీసుకువచ్చిన డిజైన్లు దేశానికంతటికీ ఆదర్శం అయ్యాయి. 1974 నుంచి 1988 వరకు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ చైర్మన్ గా పనిచేసి... సంస్థను ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు నార్ల తాతారావు. నేను విద్యుత్ రంగంలో అందించిన సేవలకు గాను పద్మశ్రీ అవార్డు తో సహా పలు అవార్డులను సైతం అందుకున్నారు నార్ల తాతారావు. 

 

 

 దామెర్ల రామారావు జననం : భారతదేశం గర్వించదగ్గ చిత్రకారులలో దామెర్ల రామారావు ఒకరు. ఈయన 1897 మార్చి 8వ తేదీన జన్మించారు. అయితే ఈయన  గొప్ప చిత్రకారుడని అంతకుమించి తెలుగు వ్యక్తి అని చాలా మందికి తెలియదు. దామర్ల రామారావుకు చిన్నతనం నుంచి చిత్రకళ పట్ల అమితమైన అభిరుచి ఉండేది. రామారావు మేనమామ వరస అయ్యే వ్యక్తి పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ గా పనిచేస్తూ ఉండేవాడు. అయితే  రామారావు ఎప్పుడూ మేనమామ తోనే ఉండేవాడు. దీంతో రామారావుకి కూడా చిత్రలేఖనం మీద మనసు మళ్ళింది. ఆరేళ్ల వయసులో గోడ మీద బొమ్మలు గీయడం ప్రారంభించిన దామెర్ల రామారావు ఆ తర్వాత తెల్లకాగితంపై బొమ్మలు వేయడం ప్రారంభించాడు. ఇక 15 ఏళ్ల వయసు వచ్చేసరికి మేనమామ ప్రోత్సాహంతో చక్కని రమణీయ దృశ్యాలు గీయడం కూడా నేర్చుకున్నాడు దామెర్ల రామారావు. ముఖ్యంగా ప్రకృతి దృశ్యాలను కళ్లకు కట్టినట్టుగా గీయడంలో దామెర్ల రామారావు ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించారు.

 

 

అయితే 1923 వ సంవత్సరంలో దామెర్ల రామారావు చిత్రించిన అసాధారణమైన అద్భుతమైన చిత్రం పుష్పాలంకరణ. ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలను గీసి... ప్రకృతి అందాలను అందరికీ తెలియజేశారు.ఈయన  గీసిన చిత్రాలు ఎంతో ప్రఖ్యాతి గాంచాయి. ఏకంగా ఆయన గీసిన చిత్రాలు బరోడా మహారాజు వంటి రాజులు సంస్థానాధీశులను కూడా అబ్బురపరిచాయి. 1923లో రాజమండ్రిలో చిత్రకళా పాఠశాల స్థాపించిన ఈయన అనేక మంది యువకులకు శిక్షణ కూడా ఇచ్చారు. ఇక  1925లోనే  అకాల మరణం చెందారు దామెర్ల రామారావు.

మరింత సమాచారం తెలుసుకోండి: