మార్చి 23వ తేదీన ఒకసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జన్మించారు. మరి ఒకసారి చరిత్ర లోకి వెళ్లి ఈ రోజు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి.. 

 

 కె బి కె మోహన్ రాజు జననం : సినిమా నేపథ్య గాయకుడు ఆకాశవాణి దూరదర్శన్ కళాకారుడు అయిన కేబి కే మోహన్ రాజు 1934 మార్చి 23వ తేదీన జన్మించారు. ఈయన పూర్తి పేరు కొండబాబు కృష్ణ మోహన్ రాజు. అయితే ఆయన 1960-70 దశకాలలో అనేక చిత్రాలలో పాటలు కూడా పాడారు. ఎంతోమంది దిగ్గజ గాయకులతో కూడా కలిసి పాడారు కెబికె మోహన్ రాజు. ఇక ఒక విడుదల కాని ఈ చిత్రానికి కూడా సంగీత దర్శకత్వం వహించారు. 

 

 వీడి రాజప్పన్  జననం  : మలయాళ సినీ హాస్యనటుడు పైన వీడి రాజప్పన్ 1950 మార్చి 23వ తేదీన జన్మించారు.  అయితే 70వ దశకంలో కలకత్తా కథా ప్రసంగం ఓ వెలుగు వెలిగిన సమయంలో రాజప్పన్  ఎంతగానో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. వీడి  రాజాప్పన్ ప్రసంగం బహుళ ప్రాచుర్యం పొందింది. అంతేకాకుండా సందర్భానుసారంగా ఆయన పేరడీ జోడించి పాడే పాటలు  ఆయన ప్రతిభకు అద్దంపట్టే విధంగా ఉండేది. 

 

 అశోక్ దాసు జననం  : ఒక భారతీయ అమెరికన్ సైద్ధాంతిక  భౌతిక శాస్త్రవేత్త ఫిజిక్స్ టీచర్ పురస్కారం అందుకున్న రచయిత అయిన అశోక్ దాసు 1953 మార్చి 23వ తేదీన జన్మించారు. 

 

 శ్రీకాంత్ జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుల్లో  ఒకరైన శ్రీకాంత్ 1968 మార్చి 23వ తేదీన జన్మించారు. ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీకాంత్ 125 సినిమాల్లో నటించారు. ఇక 2011 సంవత్సరంలో వచ్చిన విరోధి అనే సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు శ్రీకాంత్. సినిమా నటి ఊహ ను ప్రేమ వివాహం చేసుకున్నాడు శ్రీకాంత్. ఎన్కౌంటర్ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన శ్రీకాంత్... ఐదువేల పారితోషికంతో తన సినీ కెరియర్  ప్రారంభించాడు. మొదట్లో చిన్న చిన్న పాత్రలతో విలన్ గా తన ప్రస్తానని ప్రారంభించి నెమ్మదిగా హీరోగా మారిపోయాడు శ్రీకాంత్. శ్రీకాంత్ హీరోగా నటించిన మొట్ట మొదటి సినిమా వన్ బై టు. ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన తాజ్ మహల్ సినిమా శ్రీకాంత్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్లి సందడి తో శ్రీకాంత్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

 

 కంగనా రనౌత్ జననం : ప్రముఖ భారతీయ నటి అయిన కంగనారనౌత్ 1987 మార్చి 23వ తేదీన జన్మించారు. ప్రస్తుతం బాలీవుడ్లో మంచి పేరు ఉన్న హీరోయిన్ గా  కంగనా రనౌత్ దూసుకుపోతున్నారు. హిందీతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు. అయితే ఈ అమ్మడు తన నటనతో ఎప్పుడూ ఆకట్టుకోవడమే కాదు తన అందాలతో కూడా ఎంతో మందిని ఆకర్షిస్తూ ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం గల కంగనారనౌత్... ఎన్నో వివాదాలతో కూడా ఫేమస్ అయ్యింది. ఇప్పటికే ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే మరోవైపు... హీరోలతో రొమాన్స్ చేస్తూ కూడా ఎన్నో సినిమాల్లో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. 

 

 

 ఠాగూర్ అనూప్ సింగ్ జననం : ప్రముఖ భారతీయ నటుడు బాడీ బిల్డర్ అయినా ఠాకూర్ అనూప్ సింగ్ 1989 మార్చి 23వ తేదీన జన్మించారు. 2015 లో బాడీ బిల్డింగ్ లో గోల్డ్ మెడల్ అందుకున్నాడు . ఇక అప్పుడు వరకు ఎన్నో సినిమాల్లో నటించిన ఠాకూర్ అనూప్ సింగ్ ... తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన సింగం 3 సినిమా లో మెయిన్ విలన్గా నటించి మంచి గుర్తింపు సంపాదించారు. తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలో నటించారు అనూప్ సింగ్ . సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విన్నర్ సినిమాలో కూడా మెయిన్ విలన్ పాత్రలో నటించారు. ఇంకా ఎన్నో సినిమాల్లో కూడా కీలక పాత్రలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: