మార్చి 26వ తేదీన చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు  జరిగాయి. మరొక్కసారి చరిత్రలోకి వెళితే ఈ రోజు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి.. 

 

 దివాకర్ల తిరుపతిశాస్త్రి జననం : వంద సంస్కృత,  తెలుగు గ్రంధాలు నాటకములు అనువాదం చేసిన  దివాకర్ తిరుపతిశాస్త్రి 1872 మార్చి 26వ తేదీన జన్మించారు. దివాకర్ల తిరుపతి శాస్త్రి చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి ఇద్దరు  కవులను తిరుపతి వేంకటకవులు అని జంట కవులుగా తెలుగు సాహిత్యంలో  సుపరిచితులు. 

 

 ప్రకాష్ రాజ్  జననం :   దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ నటుడు ప్రకాష్ రాజ్ 1965 మార్చి 26వ తేదీన జన్మించారు. దాదాపు 100 సినిమాలకు పైగా నటించిన ప్రకాశం 5 భారతీయ భాషల మీద పట్టుంది . ఆయన ఎన్నో  పాత్రల్లో  జీవించి మరి ప్రేక్షకులు మెప్పించగల  సత్తా ప్రకాష్ రాజ్  సొంతం. ఇప్పటివరకు వివిధ భాషల్లో నటించిన ప్రకాష్ రాజ్ ఎన్నో పురస్కారాలను కూడా అందుకున్నాను. ఇప్పటిదాకా 4 జాతీయ పురస్కారాలను అందుకున్నారు ప్రకాష్ రాజ్ . వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ప్రకాష్ వ్యవసాయం చేయడం ఇష్టం లేక యవ్వనంలో బెంగుళూరుకు పారిపోయి వచ్చాడు. ఉత్తమ ప్రతినాయకులు గా కూడా ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో పురస్కారాలు కూడా అందుకున్నారు ప్రకాష్ రాజ్ . ఎలాంటి పాత్రల్లో నటించిన తనదైన నటనతో పాత్రలకు జీవం పోసేవాడు. 

 

 

భారతి గణేష్ జననం :  ప్రముఖ భారతీయ దర్శకుడు స్క్రీన్ ప్లే  రైటర్ అయినా  భారతీగణేష్ 1972 మార్చి 26వ తేదీన జన్మించారు. ఎక్కువగా తమిళ తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. ఎక్కువగా తమిళ  సినిమాలను తెరకెక్కించి మంచి గుర్తింపు సంపాదించారు. 1999 సంవత్సరంలో తమిళ్ సూపర్ హిట్ మూవీ అయిన కన్నుపడ  పోటీయా  అను సినిమాలో విజయకాంత్ సిమ్రాన్ లతో సినిమా తెరకెక్కించారు. అందరు  దర్శకుల కంటే కాస్త భిన్నంగా సినిమాలను తెరకెక్కించారు. తెలుగులో కూడా అమాయకుడు, యుద్ధం అనే సినిమాను తెరకెక్కించారు భారతీగణేష్.

 

 

మాక్స్  అబ్రహం జననం : ప్రముఖ జర్మన్ భౌతిక శాస్త్రవేత్త అయిన మాక్స్ అబ్రహం 1875 మార్చి 26వ తేదీన జన్మించారు. వర్తక  కుటుంబంలో జన్మించిన మాక్స్ అబ్రహం భౌతిక శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేశారు. 1902లో ఎలక్ట్రాన్ యొక్క వాదాన్ని అభివృద్ధి చేశాడు మాక్స్  అబ్రహం. ఆయన ఎలక్ట్రానిక్ ఖచ్చిత గోళాకారంగా ఉండి అని  దానిచుట్టూ సరిసమానంగా ఆవేశం వ్యాపించి ఉంటుంది అని పరికల్పనలు చేశాడు మాక్స్  అబ్రహం. ఇక అయిన తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి వాళ్ళు ఈ వాదాన్ని ఇంకా అభివృద్ధి చేశారు. మాక్స్ అబ్రహం తన ఆలోచనలను ఎప్పుడు ఖచ్చితమైనవిగా  అనుకునేవాడు. మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో మాక్స్ అబ్రహం జర్మనీ నుండి పంపించబడ్డాడు.  అదే సమయంలో రేడియో సేవలను  కనుగొన్నారు.

 

 

 పండితారాధ్యుల నాగేశ్వరరావు జననం : తొలితరం సంపాదకులలో  ముఖ్యుడు అయిన పండితారాధ్యులు  నాగేశ్వరరావు 1912 మార్చి 26వ తేదీన జన్మించారు. గుంటూరు లో జన్మించిన ఈయన పత్రికా రచయితగా ప్రసిద్ధి గాంచాడు. ఆంధ్రభూమి సంపాదకుడిగా విశేషమైన సేవలందించారు పండితారాధ్యుల నాగేశ్వరరావు.

మరింత సమాచారం తెలుసుకోండి: