ఏప్రిల్ 17వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళితే ఎంతోమంది ప్రముఖులు జననాలు  జరిగాయి. మరొకసారి చరిత్రలోకి వెళ్లి ఈ రోజు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి . 

 గీతా రెడ్డి జననం  : తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా  వ్యవహరించి ప్రస్తుతం బిజెపి పార్టీలో కొనసాగుతున్న నేత  గీతా రెడ్డి. ఈమె  1947 జూన్ 17వ తేదీన జన్మించారు. కాంగ్రెస్ పార్టీలో పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన గీతారెడ్డి కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. భారీ పరిశ్రమల శాఖ... చక్కెర వాణిజ్యం ఎగుమతులు శాఖ మంత్రి పౌరసంబంధాల శాఖ మంత్రిగా పని చేశారు. 

 

 

 విక్రమ్ జననం : దక్షిణ భారతదేశంలో ఎంతో క్రేజ్  సంపాదించినా హీరో విక్రమ్. 1966 ఏప్రిల్ 17వ తేదీన జన్మించారు. తమిళంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ అటు తెలుగు భాషలో కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక తెలుగు సినిమా శివ పుత్రుడు సినిమా కి ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్నారు విక్రమ్. చిన్నప్పటినుంచి హాలీవుడ్ సినిమాల పై ఎక్కువగా ఆసక్తి కనబరిచిన విక్రమ్ చదువు కన్నా ఎక్కువగా ఇతర వ్యాపకాల మీద సమయం గడిపేవాడు. నటన పై ఎంతో ఆసక్తి చూపేవాడు.  విద్యార్థి దశ నుంచే నాటకాల పై ఆసక్తి పెంచుకున్న విక్రమ్.. ఆ తర్వాత హీరోగా మారిపోయాడు. ఇక హీరోగా మారిన తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో  గుర్తింపు సంపాదించాడు. ముఖ్యంగా పాత్రకు తగ్గట్టుగా తన బాడీని మలచుకోవడంలో విక్రమ్ కి ఎవరూ సాటి లేరు అని చెప్పాలి. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి నటిస్తూ తన బాడీని పాత్రకు తగ్గట్టుగా మలుచుకున్నాడు విక్రమ్. 

 

 

 ఇంద్రగంటి మోహన కృష్ణ జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు krishna INDRAGANTI' target='_blank' title='ఇంద్రగంటి మోహనకృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇంద్రగంటి మోహనకృష్ణ 1972 ఏప్రిల్ 17వ తేదీన జన్మించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఈయన... పాఠశాల విద్య నుంచే సినిమాలపై ఎంతో ఆసక్తిగా ఉండేవారు . గ్రహణం అనే సినిమాకు దర్శకత్వం వహించిన ఈయన మొదటి సినిమాతోనే  నంది పురస్కారాన్ని అందుకున్నాడు. గ్రహణం  సినిమాకి నంది పురస్కారాలు  లభించాయి. దీంతో ఇంద్రకంటి శ్రీనివాస్ కు ఎంతో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అష్టాచమ్మా  సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత గోల్కొండ హై స్కూల్... బందిపోటు.. జెంటిల్మెన్... సమ్మోహనం లాంటి సినిమాలను తెరకెక్కించి... ఎంతో గుర్తింపు సంపాదించారు ఇంద్రగంటి మోహన కృష్ణ. అంతే కాకుండా భారత చలన చిత్ర పురస్కారాలను కూడా అందుకున్నాడు ఇంద్రగంటి మోహన కృష్ణ.

 

 సిద్ధార్థ్ నాయక్ జననం  : ప్రముఖ భారతీయుడు నటుడు నిర్మాత గాయకుడు అయిన సిద్ధార్థ తెలుగు తమిళ హిందీ భాషల్లో ఎంతగానో గుర్తింపు సంపాదించాడు. 1979 ఏప్రిల్ 16 తేదీన జన్మించిన సిద్దార్థ్... 2003 సంవత్సరంలో వచ్చిన బాయ్స్  సినిమా తో  సినీ పరిశ్రమకు పరిచయమైన  తర్వాత ఎన్నో సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు . ఇక తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే సినిమాలో  సంతోష్ అనే పాత్రలో నటించిన సిద్ధార్థ...భారత ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నటుడు అవార్డు దక్కించుకున్నారు. బొమ్మరిల్లుతో  తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గరయ్యాడు సిద్ధార్థ్. ఆ తర్వాత చుక్కల్లో చంద్రుడు అనే సినిమాతో మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక బొమ్మరిల్లు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సిద్ధార్థ్.. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించిన సిద్ధార్థ ఎంతగానో గుర్తింపు సంపాదించారు. తమిళ తెలుగు హిందీ భాషలో తనదైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: