మే 5వ తేదీన ఒకసారి చరిత్రలో కి వెళ్లి చూస్తే  ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒకసారి చరిత్రలోకి వెళితే ఈ రోజు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 

 

 జ్ఞానంబా జననం  : ప్రముఖ తెలుగు రచయిత్రి అయిన జ్ఞానాంబ... 1895 మే 5వ తేదీన జన్మించారు. ఈమెకు తల్లిదండ్రులు కనకదుర్గ వరప్రసాదిని అని పేరు పెడితే..ఈమె  గురువుగారు జ్ఞానాంబ  అనే పేరు మార్చారు. ఈమె తెలుగులో ఎన్నో రచనలు ప్రచురించడంతో పాటు ఎన్నో అనువాదాలు కూడా చేశారు.

 

 పిఠాపురం నాగేశ్వరరావు జననం  : ప్రముఖ సినీ సంగీత దర్శకుడు అయిన పిఠాపురం నాగేశ్వరరావు 1930 మే 5వ తేదీన జన్మించారు, 1946లో విడుదలైన మంగళసూత్రం అనే సినిమాలో తొలిసారిగా  సినీ రంగంలో కాలు మోపారు పిఠాపురం నాగేశ్వరరావు. 16 ఏళ్ళ  వయసులోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈయన జెమినీ వారి ప్రతిష్టాత్మక సినిమా చంద్రలేఖ లో పాడే  అవకాశం రావడంతో పరిశ్రమలో నిలదొక్కుకో గలిగారు . అప్పటి నుంచి  అనేక సినిమాల్లో పాడుతూ  సత్తా నిరూపించుకున్నాడు పిఠాపురం నాగేశ్వరరావు.ఎన్నో సినిమాలు పాటలు పాడే తన గాత్రంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. 

 

 రమాప్రభ జననం  : తెలుగు సినీ నటి అయిన రమాప్రభ 1946 మే 5వ తేదీన జన్మించారు. ఈమె సినీ ప్రస్థానంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించి ఎంతో గుర్తింపు సంపాదించారు. దాదాపు 1400 కు పైగా దక్షిణ భారత దేశపు సినిమాల్లో నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానాన్ని ఎంతో విజయవంతంగా కొనసాగించారు. ముఖ్యంగా హాస్య నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు సమప్రభా. అల్లు రామలింగయ్య రాజబాబు లాంటి నటులకు జోడీగా ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు.  ప్రముఖ నటుడు శరత్ బాబు ను  పెళ్లి చేసుకుని  14 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నారు రమాప్రభ. సినిమాల్లోకి రాక ముందు నాలుగు వేలకు పైగా రంగస్థల ప్రదర్శనలు ఇచ్చి ఎంతగానో గుర్తింపు సంపాదించారు. ఈమె కనీసం ఒకటో తరగతి కూడా చదవకుండానే  అంత గొప్ప నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. 

 

 సబితా ఇంద్రారెడ్డి జననం : ప్రముఖ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకురాలు అయిన సబితా ఇంద్రారెడ్డి 1963 మే 5వ తేదీన జన్మించారు. రంగారెడ్డి జిల్లా రాజకీయ నేతలలో ముఖ్యులు  సబితా ఇంద్రారెడ్డి. 2000,  2004లో చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2009, 2018లో మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు సబితా ఇంద్రారెడ్డి. మొదట కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా తొలిసారిగా చేవెళ్ల నియోజకవర్గం నుంచి విజయం సాధించి శాసనసభలోకి అడుగుపెట్టారు ఈమె. ఆ తర్వాత మంత్రివర్గంలో కూడా కీలకంగా వ్యవహరించారు సబితా ఇంద్రారెడ్డి. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో హోం శాఖ మంత్రి పదవిని పొంది భారత దేశంలోనే తొలి మహిళా హోంమంత్రిగా చరిత్ర సృష్టించారు. ఇక ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీలో చేరిన సబితా ఇంద్రారెడ్డి రెండుసార్లు కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

 

 లక్ష్మీ రాయ్ జననం: ప్రముఖ భారతీయ సినీ నటి అయిన లక్ష్మీరాయ్ 1989 మే 5వ తేదీన జన్మించారు. కర్ణాటక లో జన్మించిన లక్ష్మీరాయ్ ఎక్కువగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించారు. అటు తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు లక్ష్మీ రాయ్. నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. 

 

 నూతన్ నాయుడు జననం  : ఒక సామాజిక కార్యకర్త అయిన నూతన్ నాయుడు బిగ్ బాస్ లోకి రావడం ద్వారా సెలబ్రిటీ హోదాను సంపాదించారు. నూతన్ నాయుడు 1975 మే 5వ తేదీన విశాఖపట్నంలో జన్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: