మే 23వ తేదీన ఒక సారి చరిత్రలోకి వెళ్లి  చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు  జరిగాయి. మరి ఒక్కసారి చరిత్రలోకి వెళ్లి ఈరోజు  జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 

 

 కె రాఘవేంద్రరావు జననం  : తెలుగు సినీ రంగంలో దర్శకేంద్రుడి శతాధిక చిత్రాల దర్శకుడు. కోవెలమూడి రాఘవేంద్రరావు సినిమా ప్రేక్షకులందరికీ రాఘవేంద్రరావు కొసమెరుపు. ఈయన 1942 మే 23వ తేదీన కృష్ణా జిల్లా లో జన్మించారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు కె.రాఘవేంద్రరావు. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సినిమాలు ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు ఫేవరేట్ గా  నిలుస్తూ ఉంటాయి. ఎన్నో  మైలు రాళ్ళ లాంటి సినిమాలను తెరకెక్కించి... దర్శకేంద్రుడి గా ఎదిగారు రాఘవేంద్రరావు. ముఖ్యంగా కె.రాఘవేంద్రరావు చిత్రాల్లో ఎక్కువగా హీరోయిన్లను అందాల దేవతగా చూపిస్తూ ఉంటారు. రెండు మూడు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో తన హవాను నడిపించి  ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. ఎన్నో ఆధ్యాత్మిక చిత్రాలను కూడా తెరకెక్కించారు రాఘవేంద్ర రావు . ముఖ్యంగా తనదైన దర్శకత్వం తో తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. 

 


 చంద్రమోహన్ జననం: తెలుగు సినిమా రంగంలో విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే నటుడు చంద్రమోహన్. ఈయన పూర్తి పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. సినీ రంగంలోకి వచ్చిన తరువాత తన పేరును చంద్రమోహన్ గా మార్చుకున్నారు. ఈయన  1945 మే  23వ తేదీన జన్మించారు.1966లో రంగులరాట్నం చిత్రంతో సినీ ప్రస్థానం మొదలుపెట్టిన చంద్రమోహన్.. ఎన్నో సినిమాల్లో సెకండ్ హీరోగా... నటించారు ఇంకెన్నో సినిమాలు హీరోగా కూడా నటించారు. మరెన్నో సినిమాల్లో హాస్యనటుడిగా కూడా నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా హాస్యనటుడిగా చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులందరికీ చిరకాలం గుర్తుండి పోతారు. అంతేకాదు తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త హీరోయిన్లకు లక్కీ హీరోగా చంద్రమోహన్ ని  పేర్కొంటారు. జయప్రద శ్రీదేవి లాంటి నటీమణులు సైతం కెరీర్ ప్రారంభంలో చంద్రమోహన్ తో నటించి తర్వాత గొప్ప తరాలుగా ఎదిగారు . అయితే చంద్రమోహన్ కాస్త పొడుగ్గా ఉండి ఉంటే సూపర్ స్టార్ అయ్యే వారు అని సినీ అభిమానులు చెబుతుంటారు. 

 


 కోమటిరెడ్డి వెంకటరెడ్డి జననం : కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కాంగ్రెస్ నాయకులలో ముఖ్యుడు. ఎలా 1963 మే 23వ తేదీన జన్మించారు. మొదటినుంచి కాంగ్రెస్లోనే కొనసాగిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి 1999, 2004, 2009 లో నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వరుసగా విజయం సాధించారు. అయితే నల్గొండ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన తొలి శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక వైఎస్సార్, రోశయ్య మంత్రివర్గంలో  మంత్రిగా కూడా పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా పనిచేశారు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. ఇక రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ కి ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్నారు కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి.

 

 వై.వి.యస్.చౌదరి జననం : ప్రముఖ తెలుగు సినీ రచయిత దర్శకుడు నిర్మాత అయిన వైవిఎస్ చౌదరి తెలుగు ప్రేక్షకులందరికీ కొసమెరుపు. ఈయన పూర్తి పేరు ఎలమంచిలి వెంకట సత్యనారాయణ చౌదరి. ఈయన 1965 మే 23వ తేదీన జన్మించారు. 1998 సంవత్సరంలో అక్కినేని నాగార్జున నిర్మాణంలో తెరకెక్కిన శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత సీతారామరాజు, యువరాజు సినిమాలను  తెరకెక్కించారు వై.వి.యస్.చౌదరి. పలు సినిమాలకు దర్శకత్వం వహించడమే కాదు..ఆయన  సినిమాలను నిర్మించుకున్నారు కూడా. అంతే కాకుండా పలు సినిమాలను కూడా నిర్మించి నిర్మాతగా దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక ప్రస్థానాన్ని కొనసాగించారు వైవిఎస్ చౌదరి.

మరింత సమాచారం తెలుసుకోండి: