మే 28వ తేదీన ఒకసారి చరిత్రలో కి వెళ్లి చూస్తే  ఎంతో మంది ప్రముఖులు జననాలు  జరిగాయి . మరి  ఒక్కసారి చరిత్ర పుటల్లోకి  వెళ్ళి ఈరోజు  జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 

 


 సురవరం ప్రతాపరెడ్డి జననం  : పత్రికా సంపాదకుడు పరిశోధకుడు క్రియాశీల ఉద్యమకారుడు అయిన సురవరం ప్రతాపరెడ్డి 1896 మే 28 వ తేదీన జన్మించారు. ఒక గొప్ప రచయితగా ఎంతోమందికి ప్రేక్షకుడిగా క్రియాశీల ఉద్యమకారుడు బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎంతో ప్రతిభ కనబర్చారు. తెలంగాణలో కవులే లేరు అనే నింద వ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 మంది కవులతో కూడిన గోల్కొండ కవుల సంచిక గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంధరూపంలో ని సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం ఉంది . తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషి చేశారు సురవరం ప్రతాపరెడ్డి. 

 


 నందమూరి తారకరామారావు జననం : తెలుగు ప్రేక్షకులందరూ అన్నగారు అని ఎంతో అభిమానంతో పిలుచుకొనే మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు. తెలుగు ప్రజల ఖ్యాతిని ఎలుగెత్తిచూపిన కారణజన్ముడు నందమూరి తారక రామారావు. ఈయన  1923 మే 28 వ తేదీన జన్మించారు. ఒక పల్లెటూరిలో ఎన్నో కష్టాలు పడి నందమూరి తారక రామారావు సినీ రంగం పై  ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి నటుడిగా  పరిచయమయ్యారు.  ఎవరికి సాధ్యం కానీ గుర్తింపును ఖ్యాతిని సంపాదించారు నందమూరి తారక రామారావు.ఈమె తెలుగు తమిళం హిందీ భాషలలో కలిపి దాదాపుగా 400చిత్రాలలో నటించారు. ఆయన ప్రతిభను కేవలం నటనలో మాత్రమే చూపించుకునే ప్రజాసేవకు కూడా పూనుకున్నారు నందమూరి తారక రామారావు. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన నందమూరి తారక రామారావు... తెలుగుదేశం అనే పార్టీని స్థాపించాడు. కేవలం తొమ్మిది నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా... కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత మూడు దఫాలుగా పని చేసి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు నందమూరి తారక రామారావు. 

 


 పునర్నవి భూపాలం జననం : ప్రముఖ తెలుగు నటి అయిన  పునర్ణవి భూపాలం ప్రస్తుతం సినీ ప్రేక్షకులందరికీ కొసమెరుపు. పునర్నవి భూపాలం 1996 మే 28 వ తేదీన జన్మించారు. ముందుగా ఎన్నో లఘు చిత్రాలలో తన టాలెంట్ నిరూపించుకున్న పునర్నవి భూపాలం ఆ తర్వాత వెండితెరపై కూడా అక్కడక్కడ మెరిసింది. ముఖ్యంగా బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో  బిగ్ బాస్ 3 లో పునర్నవి ఎంట్రీ ఇచ్చి అక్కడ మరింత క్రేజ్ సంపాదించుకుంది. తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలిగా మారిపోయింది. ప్రస్తుతం పలు చిన్న సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. 
.

మరింత సమాచారం తెలుసుకోండి: