జూన్ 14వ తేదీన ఒకసారి చరిత్రలోకి చూస్తే  ఎంతో మంది ప్రముఖుల జననాలు  జరిగాయి. మరొక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూసి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 

 

 బుచ్చిబాబు జననం : ప్రముఖ నవలాకారుడు నాటకకర్త  అయిన బుచ్చిబాబు 1916 జూన్ 14వ తేదీన జన్మించారు. బుచ్చిబాబు  అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు. తెలుగు రచనలలో బుచ్చిబాబు అన్న కలం పేరుతో రచనలు... ఇంగ్లీష్ లో సంతోష్ కుమార్  అన్న పేరుతో రచనలు రచించారు. బుచ్చిబాబు మొత్తం మీద సుమారు 82 కథలు నవలలు వచన కావ్యాలు రాశారు. అంతేకాకుండా నలభై వ్యాసాలు నలభై నాటిక నాటకాలు కూడా రాసారు. పరామర్శ గ్రంధం సూర్య చరిత్రకు చెందిన మొదటి భాగం కొన్ని పోలికలు పరిచయాలు ఇతను రాసినవే . ఇక ఈయన రచించిన రచనలు ఎంతగానో ప్రేక్షకాదరణ పొందడంతో ఎంతగానో పేరు సంపాదించారు బుచ్చిబాబు. 

 

 చేగువేరా జననం : దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయిన చేగువేరా 1928 జూన్ 14వ తేదీన జన్మించారు. పెట్టుబడిదారీ వ్యవస్థతో పాటు సామ్యవాదం లోని సాంప్రదాయ వాదాన్ని కూడా వ్యతిరేకించారు చేగువేరా. ఫిడెల్ కాస్ట్రో నాయకత్వంలోని క్యూబా ప్రభుత్వంలో కాస్ట్రో తరువాత అంతటి శక్తివంతమైన నాయకుడిగా చెలామణి అయ్యారు చేగువేరా. చేగువేరా ఇప్పటికీవిప్లవకారుడిగా చేగువేరా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటారు. కొద్దిమంది అనుచరులతో రహస్యంగా ఆఫ్రికా దేశమైన కాంగోలో కొంతకాలం గడిపిన చేగువేరా ఆ సమయంలో ఆ దేశం యొక్క తూర్పు ప్రాంతంలో గెరిల్లా తిరుగుబాటుకు ప్రయత్నించి విఫలమయ్యారు . ఇక 1963 చివరలో మరియు దక్షిణ అమెరికా చేరి బొలీవియా దేశంలో మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న విప్లవకారులకు  నాయకత్వం వహించాడు. ఆ సమయంలోనే చేగువేరా హత్య చేయబడ్డాడు. 

 

 తరుణ్ అరోరా జుననం  : ప్రముఖ ఇండియన్ మోడల్ అయిన తరున్ అరోరా  సినీ ప్రేక్షకులకు కూడా కొసమెరుపు. ఈయన  1979 జూన్ 14వ తేదీన జన్మించారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించి తన నటనకు ఎన్నో ప్రశంసలు కూడా అందుకున్నారు తరుణ్ అరోరా. ముఖ్యంగా విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే  వారు తరుణ్ అరోరా . బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో  నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించారు. 

 

 బిందుమాధవి జననం : దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి బిందు మాధవి 1986 జూన్ 14వ తేదీన జన్మించారు. తెలుగు తమిళ పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించి ఎంతగానో  గుర్తింపు సంపాదించారు. తమిళంలో బిగ్బాస్ షోలో  కంటెస్టెంట్ గా కూడా ఎంట్రీ ఇచ్చారు బిందు మాధవి. ఈమె టెలివిజన్  అడ్వర్టైజ్మెంట్లలో  కూడా చేశారు. మోడల్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ అమ్మడు ... ఆ తర్వాత నటిగా గుర్తింపు సంపాదించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆవకాయ్ బిర్యానీ సినిమాలో హీరోయిన్గా నటించారు బిందుమాధవి.

మరింత సమాచారం తెలుసుకోండి: