జూన్ 18వ తేదీన ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు  జరిగాయి. మరి  ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 

 

 రోజర్ అబెర్ట్  జననం : అమెరికాకు చెందిన ప్రసిద్ధ సినీ విమర్శకుడు సినీ చరిత్రకారుడు పాత్రికేయుడు రచయిత అయిన రోజర్ ఎబెర్డ్  1942 జూన్ 18వ తేదీన జన్మించారు. ఈయన 1967 నుంచి 2013 వరకు చికాగో  సన్ -టైమ్స్  అనే పత్రికకు సినీ విమర్శకుడిగా పనిచేశారు.రోజర్ అబర్ట్  1975లో పులిట్జర్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి సినీ విమర్శకునిగా ప్రసిద్ధి చెందారు. మరో సినీ విమర్శకుల తో కలిసి టీవీలలో సినిమాలకు సంబంధించిన సమీక్షలను అందించారు. రోజర్ఫ్  అబర్ట్  2002లో అతని లాలాజల గ్రంథులకు థైరాయిడ్ క్యాన్సర్ వ్యాధి సోకడం  కారణంగా కింది దవడ  తొలగించాల్సి వచ్చింది. ఆ సమయంలో అతను ఆహారం తీసుకోవడానికి ఎంతో ఇబ్బంది పెడ్డప్పప్పటికీ రచన వృత్తికి  మాత్రం ఎక్కడ దూరం అవ్వలేదు. అంతర్జాలంతో సమీక్షలు అందిస్తూనే ఉన్నారు. 

 


 శాండీ అల్లెన్ జననం : మామూలుగా అయితే ఎవరైనా ఆరడుగులు ఉంటారు... అంతకంటే ఎక్కువ ఉన్నారు అంటే వాళ్లే  అందరిలో ఒకరిలా పొడవు గా కనిపిస్తూ ఉంటారు. కానీ ఏకంగా ఏడు అడుగుల ఎత్తు ఉంటే... కాదు కాదు అంతకు మించి ఉంటే  అది రికార్డు అని చెప్పాలి. ఇలా ఏడు అడుగులకు పైగా ఎత్తున్న వారు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ఇలా  ఎత్తున వారు తమ ఎత్తుతో ఎన్నో రికార్డులను సైతంసృష్టిస్తూ  ఉంటారు. శాండీ అల్లెన్ అనే మహిళ కూడా అలాంటి కోవకు చెందిందే. ప్రపంచంలోనె ఎత్తయిన మహిళ మహిళ రికార్డు సృష్టించింది శాండీ ఎల్లెన్ . ఈమె ఎత్తు 7.7 అంగుళాలు, ఈమె  1955 జూన్ 18వ తేదీన జన్మించారు. 

 


 పెండేకంటి వెంకటసుబ్బయ్య జననం :: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు పార్లమెంటు సభ్యుడు అయిన పెండేకంటి వెంకటసుబ్బయ్య 1921 జూన్ 18వ తేదీన జన్మించారు. ఈయన నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుంచి లోక్సభకు నాలుగు పర్యాయాలు ఎన్నికయ్యారు. వెంకట సుబ్బయ్య 1980 నుంచి 1984 వరకు కేంద్ర ప్రభుత్వంలో గృహ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అంతే కాదు ఈయన  బీహార్ కర్ణాటక రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేసారు. ఈయన విద్యార్థిగా ఉన్నప్పుడే జాతీయ ఉద్యమ కార్యక్రమాల్లో  జైలుశిక్షను లెక్కచేయకుండా ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: