జూన్ 21వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే  ఎంతో మంది ప్రముఖుల  జననాలు   జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ఎవరో  తెలుసుకుందాం రండి. 

 


 బెనజీర్ భుట్టో జననం : పాకిస్థాన్ దేశపు 11వ ప్రధాని అయిన బెనజీర్ భుట్టో 1953 జూన్ 21వ తేదీన జన్మించారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకురాలు బెనజీర్ భుట్టో. ఒక ముస్లిం సంఖ్యాధిక్య దేశానికి  నాయకత్వం వహించిన తొలి మహిళా మూర్తిగా బెనజీర్ భుట్టో రికార్డు సృష్టించారు. అంతేకాకుండా పాకిస్థాన్ లాంటి ముస్లిం సంఖ్యాదిక్య దేశానికి రెండుసార్లు ప్రధానమంత్రి అయిన ఏకైక మహిళగా రికార్డు సృష్టించారు. బెనజీర్ భుట్టో. 1970లో పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పనిచేసిన జుల్ఫీకర్  అలీ భుట్టో కుమార్తె బెనజీర్ భుట్టో. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుని ... ఆక్స్ఫర్డ్ యూనియన్ కు నాయకత్వం వహించిన తొలి ఆసియా మహిళగా కూడా నిలిచారు. బెనజీర్ భుట్టో తండ్రి ప్రభుత్వాన్ని కూలదోసిన 1977 నాటి సైనిక తిరుగుబాటు తర్వాత కుటుంబ సభ్యులతో సహా పలుమార్లు గృహనిర్బంధంలో జీవించాల్సి వచ్చింది.

 


 ఎడ్వర్డ్ స్నోడెన్ జననం : అమెరికా కంప్యూటర్ నిపుణుడు అయిన ఎడ్వర్డ్ స్నోడెన్ 1983 జూన్ 21వ తేదీన జన్మించారు. అతను మొదట్లో అమెరికా ప్రభుత్వ నిఘా సంస్థ అయిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లో... సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ గా పనిచేశారు. అంతేకాకుండా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లో కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ శిక్షకుడిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత డెల్ సంస్థ తరఫున ప్రైవేట్ కాంట్రాక్టర్ గా జపాన్లో ఉన్న నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థలో చేరాడు ఎడ్వర్డ్ స్నోడెన్. మార్చ్ 2013లో హువాయి  లోని బుజ్ అలేన్ హామిలిటన్  అనే కన్సల్టింగ్ సంస్థ లో పని చేసారు. జూన్ 2013లో అతను ముందు పని చేసిన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ నుండి సేకరించిన అనేక రహస్య పత్రాలను కూడా పలు మీడియా సంస్థలు వెల్లడించడంతో... అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచాడు ఎడ్వార్డ్ స్నోడెన్.  అయితే అమెరికా చరిత్రలోనే మునుపెన్నడూ కూడా ఇంత భారీ మొత్తంలో రహస్యాలు వెల్లడి కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: