జూన్ 26వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళితే ఎంతో మంది ప్రముఖులు జననాలు  జరిగాయి. ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 

 

 రాజు నరిశెట్టి జననం : ప్రఖ్యాత ఆంగ్ల పాత్రికేయుడు రాజు నరిశెట్టి 1966 జూన్ 26 తేదిన జన్మించారు. 13 సంవత్సరాల పాటు వాల్ స్ట్రీట్ జర్నల్ లో ఐరోపా సంపాదకుడిగా పనిచేశారు ఈయన. 2006 నుంచి 2008 వరకు మెంట్ అనే వ్యాపార పత్రికకు స్థాపక సంపాదకుడిగా కూడా వ్యవహరించారు. 2009 సంవత్సరం నుంచి ప్రఖ్యాతిగాంచిన వాషింగ్టన్ పోస్ట్ పత్రిక కు ముఖ్య సంపాదకునిగా పనిచేశారు రాజు నరిశెట్టి, రాజు ఆ పదవిలో  నియమించబడిన మొదటి వ్యక్తి, 

 


 ఉదయ్ కిరణ్  జననం : ప్రముఖ తెలుగు సినిమా హీరో అయిన ఉదయ్ కిరణ్ తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ సుపరిచితులే. ఉదయ్ కిరణ్ 1980 జూన్ 26 తేదిన జన్మించారు, తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు ఉదయ్ కిరణ్. ముఖ్యంగా ఉదయ్ కిరణ్  కథానాయకుడిగా వచ్చిన మొదటి మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో హ్యాట్రిక్ హీరో అనే పేరును టాలీవుడ్ సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్, దర్శకుడు తేజ తెరకెక్కించిన చిత్రం సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోగా పరిచయమైన ఉదయ్ కిరణ్... తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ట్రెండ్ ను సృష్టించారు అనే చెప్పాలి, చిత్రం సినిమా బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన నువ్వు నేను మనసంతా నువ్వే సినిమాలు  కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ విజయాన్ని అందుకున్నాయి   నువ్వు నేను సినిమా కి గాను ఫిలిం ఫేర్ అవార్డు కూడా వరించింది ఉదయ్ కిరణ్ కి . తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు ఉదయ్ కిరణ్. కానీ ఆ తర్వాత వరుస ప్లాపులు చవిచూశారు. 2014 జనవరి 6వ తేదీన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ఉదయ్ కిరణ్.

 

 సురేష్ గోపి జననం : తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు అయిన సురేష్ గోపి 1959 జూన్ 26వ తేదీన జన్మించారు. తనదైన నటనతో  కోలీవుడ్లో ఎంతగానో గుర్తింపు సంపాదించారు సురేష్ గోపి, ఇక తన నటనకు గాను ఏకంగా  జాతీయ ఉత్తమ నటుడిగా కూడా అవార్డును అందుకున్నారు సురేష్ గోపి. 1965లో నటుడిగా తన కెరీర్ను ప్రారంభించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా  కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత ఎన్నో  వైవిధ్యమైన పాత్రల్లో నటించారు సురేష్ గోపి

మరింత సమాచారం తెలుసుకోండి: