జూలై 9 వ తేదీన ఒకసారి హిస్టరీ  లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు జరిగాయి. మరొక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో  తెలుసుకుందాం రండి. 


 గురుదత్ జననం  : దక్షిణ భారతదేశంలోని మైసూరులో జన్మించిన భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన లెజెండరీ దర్శకుడు నిర్మాత నటుడు అయిన గురుదత్ 1925 జూలై 9 వ తేదీన జన్మించారు. చిన్నప్పటి నుంచి నాట్యా  కళాకారుడిగా ఎంత గుర్తింపు సంపాదించుకున్న గురుదత్... ఆ తర్వాత  స్టూడియోలో కొరియోగ్రాఫర్ గా చేరారు. తర్వాత సినిమాలను నిర్మించటం దర్శకత్వం వహించటం చేసారు. మొదటి వరుస విజయాలను అందుకున్న గురుదత్  ఆ తర్వాత వరుస పరాజయాలతో సినిమాలు చేయడం మానేశారు. ఆ తర్వాత మళ్లీ సినిమాల పై మక్కువతో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు గురుదత్. చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను రాష్ట్రపతి రజత పథకాన్ని, బెంగాల్ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అవార్డును కూడా గెలుచుకున్నారు.  కేవలం కొరియోగ్రాఫర్గా దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో గుర్తింపు సంపాదించారు. నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలను నిర్మించారు గురుదత్త. 

 

 గుమ్మడి వెంకటేశ్వరరావు జననం   : తెలుగు సినిమా రంగములో గుమ్మడిగా ఎంతగానో పేరుప్రఖ్యాతలు సంపాదించిన గుమ్మడి వెంకటేశ్వరరావు 1927 జూలై 9 వ తేదీన జన్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా నటించి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే రఘుపతి వెంకయ్య అవార్డును సైతం అందుకున్నారు. దాదాపు 500కు పైగా సినిమాలలో విభిన్న తరహా పాత్రలు పోషించి చలనచిత్ర రంగంలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నాడు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము ఈయనను  కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. ఈయన  గుమ్మడి పేరుతోనే తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచి పోయాడు.


 సంజీవ్ కుమార్ జననం  : భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంతగానో పేరుప్రఖ్యాతలు సంపాదించిన గొప్ప నటుడు సంజయ్ కుమార్ 1933 జూలై 9 వ తేదీన జన్మించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ఉత్తమ నటుడిగా రెండుసార్లు జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నారు. వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే సంజీవ్ కుమార్  తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. 1960లో హమ్ హిందుస్తానీ అనే సినిమాలో చిన్న పాత్ర ద్వారా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు సంజీవ్ కుమార్. 1965లో నిషాన్ అనే సినిమా ద్వారా కథానాయకుడిగా తన ప్రస్థానం మొదలు పెట్టారు. 


 బొత్స సత్యనారాయణ జననం  : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత అయిన బొత్స సత్యనారాయణ 1958 జూలై 9 వ తేదీన జన్మించారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరుపున నుంచి ఎంపీగా ఎన్నుకోబడ్డారు బొత్స సత్యనారాయణ. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ప్రభుత్వ రవాణా శాఖ మంత్రిగా పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు బొత్ససత్యనారాయణ. 


 ఉన్నికృష్ణన్ జననం : ప్రముఖ శాస్త్రీయ సంగీత సినీ గాయకుడు ఉన్నికృష్ణన్ 1966 జూలై 9 వ తేదీన జన్మించారు. తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ ఆంగ్ల భాషలలో ఎన్నో  పాటలు పాడి ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు, ఉత్తమ గాయకుడిగా జాతీయ పురస్కారాన్ని సైతం అందుకున్న ప్రతిభాశాలి ఉన్ని కృష్ణన్ 

 


 వెంకటపతిరాజు జననం  : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు కుడిచేతి వాటం బ్యాట్స్మన్ అయినా వెంకటపతిరాజు 1969 జూలై 9 వ తేదీన జన్మించారు. కుడి చేతితో బ్యాటింగ్ ఎడమచేతితో బౌలింగ్ చేయగలరు ప్రతిభ వెంకటపతిరాజు సొంతం. 1989లో భారత టెస్టు వన్డే జట్టులో ప్రవేశించిన మొదటి సారిగా న్యూజీలాండ్ పై అంతర్జాతీయ క్రీడా జీవితం ప్రారంభించారు. ఆడిన మొదటి టెస్ట్ మ్యాచ్ లోనే  తన సత్తా చాటి ఎంతోమందిని ఆకర్షించారు వెంకటపతి రాజు. భారత జట్టులో అంచెలంచెలుగా ఎదిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: