నిజంగానే ఈ కరోనా మహమ్మారికి పెద్ద, చిన్న, ముసలి, పిల్లలు అని తేడాలేకుండా ప్రస్తుతం ప్రపంచం మొత్తం దీని విశ్వరూపం చూపిస్తుంది. ఇందులో భాగంగానే కరోనా వైరస్‌ బారిన పడిన ఇంగ్లాండ్ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ (55) ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. కరోనా సోకినా ఆయనని వ్యాధి తీవ్రత ఎక్కువ అవుతుండడంతో వైద్యులు ఆయన్ను ICU కు తరలించారు. 

 

 


అయితే కరోనా లక్షణాలు కనిపించడంతో మార్చి 26 తేదీ నుండి ఆయన స్వీయ నిర్బంధంలో ఉంటూ ఆయనకి చికిత్స చేస్తున్నారు. కానీ, అయన పరిస్థితిలో ఎటువంటి మార్పు లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు ఆయనని లండన్ ఆసుపత్రిలో చెరిపించారు. ఇది ఇలా ఉండగా తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, కాకపోతే కొన్ని కరోనా లక్షణాలు ఉండడంతో ఆస్పత్రిలో చేరానని ప్రధాని బోరిస్‌ ఒక వీడియో కూడా విడుదల చేశారు. 

 

 

అయితే ఇది ఇలా ఉండగా సోమవారం వ్యాధి తీవ్రత పెరగడంతో ఆయన్ని ICU కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రధాని ఆసుపత్రిలో చేరడంతో బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యదర్శి డొమినిక్ రాబ్ ప్రభుత్వ బాధ్యతలు చేపడుతున్నారు. ప్రస్తుతానికి అక్కడి ప్రభుత్వం లెక్కల ప్రకారం కరోనా కేసులు సంఖ్య 51,608 గా ఉండగా, ఈ మహమ్మారి బారిన పడి ఏకంగా 5,373 మంది మృత్యువాత పడ్డారు. ఏది ఏమైనా ఈ మహమ్మారి దెబ్బకి ప్రపంచం మొత్తం స్థంబించిపోవడం నిజానికి బాధాకరమైన విషయమే. ఈ మహమ్మారి నుంచి ప్రపంచం మొత్తం ఎప్పటికి బయట పడుతుందో ఆ దేవుడికి మాత్రమే తెలియాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: