ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో ఉన్న 304 కేసుల‌కు ఈ రోజు ఏకంగా 8 కొత్త కేసులు క‌ల‌వ‌డంతో మొత్తం 312 కేసులు న‌మోదు అయ్యాయి. ఈ కొత్త కేసుల‌ను కూడా క‌ల‌పుకుంటే ఒక్క గుంటూరు జిల్లాలోనే మొత్తం 41 కేసులు న‌మోదు అయిన‌ట్టు అయ్యింది. ఈ విష‌యాన్ని జిల్లా క‌లెక్ట‌ర్ శామ్యూల్ ఆనంద్ ప్రెస్‌మీట్ పెట్టి మ‌రి వివ‌రించారు. జిల్లాలో ఉన్న మొత్తం 41 కేసుల్లో ఒక్క గుంటూరు న‌గ‌రంలోనే ఏకంగా 27 కేసులు ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు. న‌గ‌రంలోని బుచ్చ‌య్య తోట‌, సంగ‌డిగుంట‌, కుమ్మ‌రి బ‌జార్‌, ఆనంద‌పేట‌, మంగ‌ళ‌దాస్ న‌గ‌ర్‌, శ్రీనివాస‌రావుతోట‌, ఆటో న‌గ‌ర్ ప్రాంతాల‌ను రెడ్ జోన్లుగా గుర్తించిన‌ట్టు తెలిపారు.

 

ఇదిలా ఉంటే కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ విధించడంతో ఏపీకి చెందిన 5 వేల మంది మత్స్యకారులు గుజరాత్‌లోని వెరావల్‌లో చిక్కుకుపోయారు. వారు త‌మ ఇబ్బందుల‌ను ఏపీ ప్ర‌భుత్వానికి విన్న‌వించ‌డంతో దీనిపై తక్షణమే స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌.. వారికి సాయం అందిచాల్సిందిగా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సతీష్‌ చంద్రకు ఆదేశాలు జారీచేశారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: