తెలంగాణలో ప్రస్తుతం మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 404గా ఉండగా... ఇప్పటివరకూ ఏడుగురు చనిపోయారు. పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 500 చేరొచ్చని ప్రభుత్వం అనుకుంటోంది. ఈ విషయంలో నెక్ట్స్ ఏం చెయ్యాలో ఆలోచించిన ప్రభుత్వం... రాష్ట్రంలోని 100 గ్రామాలు, ప్రదేశాల్ని హాట్ స్పాట్‌లుగా గుర్తించాలని డిసైడైంది. కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపించే ప్రాంతాల్నే ఈ టాప్ 100 లిస్టులో పెట్టి... అక్కడ ఎక్కువ కండీషన్లు పెట్టబోతోంది.కరీంనగర్ జిల్లాలో 10 మంది ఇండోనేసియా ప్రజలకు కరోనా పాజిటివ్ వచ్చాక... వాళ్లు ఎక్కడెక్కడ తిరిగారో... ఆ ప్రదేశాలకు చుట్టూ 3 కిలోమీటర్ల వరకు ప్రభుత్వం ఇలాగే కండీషన్లు పెట్టి అమలు చేసింది.

 

తద్వారా అక్కడ చాలా వరకూ కరోనా కేసుల్ని కట్టడి చేసింది.తాజాగా నిజామాబాద్‌లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి కాబ్టటి ప్రభుత్వం ప్రకటించే 100 హాట్ స్పాట్‌లలో 15 ఈ జిల్లాలోనే ఉంటాయని తెలిసింది. తాజాగా నిర్మల్ లో మరో నాలుగు పాజిటీవ్ కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.  వీ

 

రిలో పెంబి మండలం రాయదారి గ్రామానికి చెందిన వ్యక్తి ఒకరు కాగా... లక్ష్మణ చాందా మండలం కనకాపుర్‌లో ఒకరు... రాచాపుర్ గ్రామానికి చెందిన మరొకరు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అలాగే మామడ మండలం న్యూ లింగాపుర్ గ్రామానికి చెందిన వ్యక్తికి కుడా కరొనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు.
 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: