ప్రపంచంలో కరోనా మహమ్మారి రోజు రోజుకీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఈ కరోనా ని పూర్తిగా అరికట్టేందుకు ఎలాంటి వ్యాక్సిన్ రాలేదు. కేవలం కరోనా ని జాగ్రత్తలు పాటిస్తూ అరికట్టగలం.. అందుకు చేతులు శుభ్రం చేసుకోవాలి.. ముఖానికి మాస్క్ పెట్టుకోవాలి.. సామాజిక దూరం పాటించాలని అని ప్రచారాలు చేస్తున్నారు. తాజాగా కేవలం మాస్కులు వాడటంతోనే కరోనాను కట్టడి చేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అధిపతి టెడ్రోస్‌ అధానోమ్‌ గేబ్రియేసస్‌ తెలిపారు. చేతులు శుభ్రం చేసుకోవడం, నిర్ణీత దూరం పాటించడమే ఎంతో ముఖ్యమన్నారు. 

 

మనం లేచిన మొదలు పడుకునే వరకు వివిధ వస్తువులను తాకుతుంటాం.. వాటిలో ఏ వస్తువులపై కరోనా క్రిములు ఉంటాయో తెలియదు.. అందుకే ఎక్కడికి వెల్లి వచ్చినా.. ఏ వస్తువులను వాడిన తర్వాత సాధ్యమైనంత వరకు శానిటైజర్లు వాడాలి.. లేదా సబ్బు తో చేతులను శుభ్రం చేసుకోవాలని అంటున్నారు.  అయితే సంక్షోభ ప్రాంతాల్లో దుర్భర జీవితం గడుపుతూ సామాజిక దూరం పాటించలేనివారు, నీటి వసతి లేక చేతులు శుభ్రం చేసుకోలేనివారు సాధారణ మాస్కులు ధరించడం మేలన్నారు.

 

ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలు వీటిని వినియోగించవద్దని టెడ్రోస్‌ సూచించారు. కాగా, కరోనా టీకాను ఆఫ్రికా ప్రజలపై ప్రయోగించాలన్న ఇద్దరు ప్రముఖ ఫ్రెంచ్‌ డాక్టర్ల వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.  ఇక వైరస్‌ సోకిన వారికి చికిత్స అందించే వైద్య సిబ్బంది, వారికి సేవలు చేసేవారు వైద్యపరమైన మాస్కుల కొరత ఎదుర్కొంటున్నారని వీటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని అన్నారు. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: