ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ చేస్తున్న బీభత్సానికి అతలాకుతలం అవుతున్నారు.  అమెరికా లాంటి అగ్ర రాజ్యం కూడా ఈ వైరస్ ధాటికి తట్టుకోలేక తలలు పట్టుకుంటున్నారు.. ఇక్కడ మరి రెండు నిమిషాలకు ఒక మరణం సంబవిస్తుందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఊహించుకోవొచ్చు. అయితే కరోనాని నిర్మూలించేందుకు యాంటీ డోస్ కోసం అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇక కరోనా టెస్ట్ చేయడానికి కొంత వ్యవధి  పడుతుంది.  తాజాగా కరోనా నిర్ధారణ పరీక్ష ఫలితాలు 55 నిమిషాల్లోనే తేలేలా.. టెస్టింగ్‌ కిట్‌లను విశాఖలోని మెడ్‌టెక్‌ జోన్‌ అందుబాటులోకి తెచ్చింది.

 

ముందుగా 100 కిట్‌లను ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) పరిశీలనకు పంపించినట్లు తెలుస్తోంది. అయితే  ఈ కిట్‌ల పనితీరును ఐసీఎంఆర్‌ పరిశీలించిన తర్వాత.. వినియోగానికి అనుమతించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారట. నెలరోజుల్లో 25వేల కిట్‌లను తయారుచేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐసీఎంఆర్‌ నుంచి అనుమతులు రావటంతో ఉత్పత్తిని పెంచేందుకు సిద్ధమయ్యారట. 

 

త్వరలో ఈ విషయాన్ని  ముఖ్యమంత్రి జగన్ చేతులమీదుగా ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు.  ఏఎంటీజడ్‌లోని రెండు పరిశ్రమలు ఈ కిట్‌ల తయారీని  ప్రారంభించినట్లు సమాచారం. ఈ పరిణామం మంచి శుభసూచికం అని కరోనా టెస్ట్ లు ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత ఫలితం ఉంటేందని.. రోగి కూడా తగు జాగ్రత్తలు తీసుకునే వీలు ఉందని అంటున్నారు. 

 


కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: