కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌లో విషాదం చోటుచేసుకుంది. క‌రోనా లాక్‌డౌన్ వ‌ల్ల ఎంతో మంది వ‌ల‌స కార్మికులు.. వ‌ల‌స కూలీల ఆక‌లి బాధ‌లు చెప్ప‌లేనివిగా మారాయి. నార్త్ నుంచి మ‌న తెలుగు రాష్ట్రాల‌కు వ‌చ్చిన వారు ఏదోలా ఇక్క‌డ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల వ‌ల్ల కాస్త క‌డుపు నింపుకుంటున్నా మిగిలిన రాష్ట్రాల్లో ఈ ప‌రిస్థితులు లేవు. ముఖ్యంగా ఉత్త‌ర భార‌తంలో వ‌ల‌స కూలీల బాధ‌లు అన్నీ ఇన్నీ కావు. అంతెందుకు ఇటీవ‌ల ఓ వ్య‌క్తి మ‌హారాష్ట్ర నుంచి లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఇంటికి వెళ్లిపోతే భార్య బిడ్డ‌ల‌తో క‌లిసి ఏ గంజో తాగి అయినా బ‌త‌క‌వ‌చ్చ‌ని కాలిన‌డ‌కనే త‌మిళ‌నాడు బ‌య‌లుదేరి మార్గ‌మ‌ధ్యంలో సికింద్రాబాద్‌లోనే చ‌నిపోయాడు.

 

ఇక ఇప్పుడు క‌ర్నాట‌క‌లోనూ ఇలాంటి విషాద సంఘ‌ట‌న ఒక‌టి చోటు చేసుకుంది. పొట్టచేత పట్టుకుని బెంగళూరుకు వెళ్తే అక్కడి పని లేక మళ్లీ సొంతూరికి కాలినడకన బయల్దేరిన మహిళ మధ్యలోనే ఆకలి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయింది. రాయచూరు జిల్లా సింధనూరు పట్టణంలోని వెంకటేశ్వర్‌ నగర్‌కు చెందిన గంగమ్మ (29) బెంగ‌ళూరులో భ‌వ‌న నిర్మాణ ప‌నులు చేస్తోంది. లాక్‌డౌన్ నేప‌థ్యంలో అక్క‌డ ప‌నులు లేక‌పోవడంతో పాటు తిండి లేక‌పోవ‌డంతో ఇంటికి వెళ్లిపోవాల‌ని నిర్ణ‌యించుకుంది.

 

ఈ క్ర‌మంలోనే గంగమ్మతో పాటు పలువురు ట్రాక్టర్‌లో బెంగళూరు నుంచి తుమకూరు వరకు వచ్చారు. అక్క‌డ వాహ‌నాలు నిలిపి వేయ‌డంతో గంగ‌మ్మ కాలిన‌డ‌క‌నే బ‌ళ్లారికి చేరుకునేందుకు బ‌య‌లు దేరింది. బళ్లారికి చేరుకునేందుకు మూడు రోజులు పట్టగా, అన్నపానీయాలు లేక చివ‌ర‌కు తాగేందుకు మ‌ధ్య‌లో ఎవ్వ‌రూ మంచినీళ్లు కూడా ఇవ్వ‌క‌పోవ‌డంతో బాగా నీర‌సించి మృతిచెందింది. బ‌ళ్లారి వ‌చ్చాక ఆమెను ఎస్సీ, ఎస్టీ వ‌స‌తి గృహంలో ఉంచ‌గా అప్ప‌టికే నీరసించిపోవడం, రక్తహీనత, కాలేయ సమస్యల‌తో మృతిచెందింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: